అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఆయన హ్యాండ్సమ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చే అమ్మాయిలు ఎంతో మంది! ఆయన నటన మెచ్చిన జనాలు ఉన్నారు. అయితే... హీరోగా ఆయనకు ఆశించిన హిట్స్ మాత్రం లేవు. అఖిల్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఐదు అంటే ఐదు. అందులో హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే... అక్కినేని అభిమానులు అఖిల్ నుంచి ఆశించిన హిట్స్ రాలేదు. 'ఏజెంట్' తర్వాత ఆయన కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. లేటెస్టుగా ఆయన కొత్త సినిమా గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
లింగుస్వామి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
తమిళ దర్శకుడు లింగుస్వామి (Lingusamy)తో అఖిల్ అక్కినేని ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని, వాళ్ళిద్దరి కలయికలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ ఖబర్.
'రన్', 'పందెం కోడి', 'ఆవారా' సినిమాలతో లింగుసామి తెలుగులో కూడా విజయాలు అందుకున్నారు. తెలుగు హీరో రామ్ పోతినేనితో 'ది వారియర్' చేశారు ఆయన. ఆ తర్వాత చేయబోయే సినిమా అఖిల్ అక్కినేనితో అనేది టాక్. తమిళంలో మాధవన్, ఆర్య హీరోలుగా లింగుసామి దర్శకత్వం వహించిన తమిళ సినిమా 'వెట్టై' చిత్రాన్ని తెలుగులో అక్కినేని నాగ చైతన్య రీమేక్ చేశారు. కానీ, అక్కినేని హీరోలతో లింగుసామి సినిమాలు చేయలేదు. ఇప్పుడు చైతూ తమ్ముడితో చేయనున్నారని టాక్.
Also Read : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
ప్రభాస్ సొంత సంస్థలో అఖిల్ సినిమా!
నిజం చెప్పాలంటే... 'ఏజెంట్' తర్వాత ప్రభాస్ హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్ సంస్థలో అఖిల్ అక్కినేని హీరోగా ఓ సినిమా ప్రొడ్యూస్ చేయనుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమాతో 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. ఆయన అఖిల్ క్లోజ్ ఫ్రెండ్ అట.
అఖిల్, అనిల్ కుమార్ సినిమాకు 'ధీర' టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. అందులో కథానాయికగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అఖిల్ సరసన నటించనున్నారట.
Also Read : 'కన్నప్ప'లో ప్రభాసే కాదు, నయనతార కూడా - ఆమె క్యారెక్టర్ ఏమిటంటే?
ఓటీటీలో విడుదలకు 'ఏజెంట్' రెడీ
అఖిల్ అక్కినేని ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన 'ఏజెంట్'కు మొదటి ఆట నుంచి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్, వక్కంతం వంశీ కథపై పలు విమర్శలు వచ్చాయి. సిక్స్ ప్యాక్ చేసి, హెయిర్ పెంచి అఖిల్ కష్టపడినప్పటికీ... ఆశించిన ఫలితం రాలేదు. 'ఏజెంట్' సినిమా విడుదల తర్వాత చాలా రోజులు ఓటీటీ విడుదల విషయంలో క్లారిటీ రాలేదు. అనూహ్యంగా ఈ నెల 28న ఓటీటీలో విడుదల కానున్నట్లు సోనీ లివ్ ఓటీటీ అనౌన్స్ చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial