December 2025 movie releases: డిసెంబర్ మొదటి వారం థియేటర్లలోకి వచ్చేందుకు ఒక్కో సినిమా రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ మీద కర్చీఫ్‌లు వేయడం స్టార్ట్ చేస్తున్నారు హీరోలు & దర్శక నిర్మాతలు. నిజం చెప్పాలంటే... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' డిసెంబర్ మొదటి వారంలో రావాలి. ఆ సినిమా సంక్రాంతి పండక్కి వెళ్లడంతో ఇతర సినిమాలు వస్తున్నాయ్. ఇప్పుడు ఆ లిస్టులో కార్తీ కొత్త సినిమా కూడా చేరింది.
బాలకృష్ణ 'అఖండ 2'తో పాటుగా...కార్తీ 'వా వాతియార్' సినిమా విడుదల!Balakrishna Akhanda 2 Vs Karthi Vaa Vaathiyaar: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా 'అఖండ 2 తాండవం'. డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాతో పాటుగా అదే రోజున కార్తీ సినిమా సైతం థియేటర్లలోకి రానుంది. ఇవాళ విడుదల తేదీ అనౌన్స్ చేశారు.
Also Read: పవన్ సినిమాలో విలన్ రోల్... రిజక్ట్ చేసిన పాపులర్ పొలిటీషియన్!
కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన తమిళ్ సినిమా 'వా వాతియార్'. కార్తీకి తెలుగులో ఫ్యాన్ బేస్ ఉంది. హీరోయిన్ కృతి శెట్టి తెలుగులో సినిమాలు చేశారు. అందుకని, ఆ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
స్టూడియో గ్రీన్ పతాకం మీద జ్ఞానవేల్ రాజా 'వా వాతియార్' సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో రాజ్ కిరణ్, సత్యరాజ్, కరుణాకరణ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు నలన్ కుమారసామి దర్శకుడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.