Akhanda 2 Latest Release Date: కొన్నిసార్లు రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా - ఇది 'గోపాల గోపాల' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్. ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'అఖండ 2 తాండవం' విడుదలకు సరిగ్గా సెట్ అవుతుంది. థియేటర్లలోకి సినిమా రావడం లేట్ అయ్యింది. కానీ లేటెస్టుగా రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది 14 రీల్స్ ప్లస్ సంస్థ.
డిసెంబర్ 12న థియేటర్లలోకి 'అఖండ 2'Akhanda 2 release on December 12th in India: 'అఖండ 2' విడుదలకు ఉన్న చిక్కులు తొలగిపోయాయి. దాంతో కొత్త విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ వెల్లడించింది.
డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు 'అఖండ 2' సినిమా రెడీ అయ్యింది. ముందు రోజు... అంటే డిసెంబర్ 11వ తేదీ రాత్రి ఏపీ & తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ (నార్త్ అమెరికా)లో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ మూవీ రిలీజ్. 'అఖండ 2'తో మరో 48 గంటల్లో రికార్డుల వేటకు నట సింహం బాలయ్య రెడీ అవుతారు. సో, ఫాన్స్... గెట్ రెడీ! తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read: Japan Earthquake: జపాన్‌లో భూకంపం... మన బాహుబలి ప్రభాస్ సేఫ్ - రాజా సాబ్ డైరెక్టర్ క్లారిటీ
ఐదు రోజులుగా వార్తల్లో బాలయ్య సినిమా!'అఖండ 2' టీం ప్లాన్ చేసినట్టు డిసెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లు, మరుసటి రోజు 5వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే ఇప్పుడు జరిగినంత డిస్కషన్ అసలు ఉండేది కాదు. అనూహ్యంగా, ఆఖరి నిమిషంలో సినిమా విడుదల క్యాన్సిల్ కావడంతో ఎక్కువ డిస్కషన్ జరిగింది. 'అఖండ 2' విడుదల వాయిదా పడటానికి కారణాలు ఏమిటి? అని ఎక్కువ చర్చ జరిగింది.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ హైక్ జీవోలు రావాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్స్ రివైజ్డ్ చేసి జీవోలు ఇవ్వనున్నాయి.
Also Read: Nivetha Pethuraj: పెళ్ళికి ముందు బ్రేకప్... స్మృతి మంధాన రూటులో హీరోయిన్ నివేదా పేతురాజ్
'సింహ', 'లెజెండ్', 'అఖండ' బ్లాక్ బస్టర్స్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలయికలో రూపొందిన నాలుగో చిత్రమిది. దీనితో డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయడంతో పాటు పాన్ ఇండియా మార్కెట్టులో అడుగు పెట్టనున్నారు. బాలకృష్ణ సరసన సంయుక్త కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్. తమన్ సంగీతం అందించగా... బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేశారు.