Aishwarya Rajinikanth On Lal Salaam Failure: ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. హిందూ, ముస్లిం ఐక్యత, క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్వకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  ఈ సినిమాలో రజనీ కీలక పాత్ర చేశారు. దాంతో మూవీపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అలా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. రజనీ సినిమా అంటే తమిళనాట పండగ వాతావరణం కనిపిస్తుంది.


కానీ లాల్‌ సలాం విషయంలో ఆ హడావుడి, సందడే లేదు. రజనీ రేంజ్‌లో హంగామా కనిపించనేలేదు. ఇక తెలుగులో అయితే ఈ సినిమాని పట్టించుకున్నవారే కనిపించలేదు. రజనీ కెరీర్‌లో ఇప్పటికి వరకు చూడని, రానీ భారీ ప్లాప్‌ ఇది. దీంతో ఆయన ఈ సినిమా ఎందుకు చేశారా? అని ఫ్యాన్స్‌ అంతా నిరాశపడ్డారు. డైరెక్టర్‌ ఐశ్వర్యని అయితే అంతా తిట్టిపోశారు. సూపర్‌ స్టార్‌ లాంటి రజనీ సినిమా చేస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుకోవాలి, అవేం ఇందులో లేవు అంటూ విమర్శించారు. రజనీ వల్లే కనీసం టాక్‌ అయినా ఉంది, లేదంటూ ఈ సినిమా అనేది ఉందా? కూడా ఎవరికి తెలిసి ఉండేది కాదామో అని కొందరి అభిప్రాయం.


నాన్న పాత్ర నిడివి పెంచాం.. అదే మైనస్ అయ్యింది


ఈ సినిమాకు ఉన్న అంతాకొంత ప్లస్‌ అంటే అదీ రజనీనే అని  ఫ్యాన్స్‌ అంటుంటే..  సినిమా ప్లాప్‌కు తన తండ్రే కారణమంటున్నారు ఆయన కూతురు ఐశ్వర్య. ఇటీవల తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఐశ్వర్య లాస్‌ సలాం ఫ్లాప్‌పై స్పందించింది. నాన్న వల్లే ఈ సినిమా కథ గందరగోళానికి గురైందని చెప్పకనే చెప్పింది. ఈ మేరకు ఐశ్వర్య మాట్లాడుతూ.. "నాన్న అభిమానులకు ఈ సినిమా నచ్చలేదు. అందుకే ప్లాప్‌ అయ్యింది. వారి తీర్పు నేను గౌరవిస్తాను. రిలీజ్‌ తర్వాత లాల్‌ సలాం ప్లాప్‌కు కారణాలను అర్థమయ్యాయి. నెక్ట్స్‌ నుంచి ఈ తప్పులను రిపీట్‌ కానివ్వను. నిజానికి మొదట ఈ కథను అనుకున్నప్పుడు నాన్న పాత్ర కేవలం పది నిమిషాలే ఉంటుంది. కానీ మూవీ చిత్రీకరిస్తున్న టైంలో ఆయన పాత్ర నిడివిని పెంచాం. అదే సినిమా గందరగోళానికి కారణమైంది.


అనుకున్నది అనుకున్నట్టు తీసి ఉంటే మేం ఏం చెప్పాలనుకున్నాం అదీ ఫ్యాన్స్‌, ఆడియనన్స్‌ రీచ్‌ అయ్యేది. నాన్న పాత్ర చిత్రీకరిస్తున్నప్పుడు ఫ్యాన్స్‌ని ద్రష్టిలో పెట్టుకుని వారిని నిరుత్సాహరచద్దు అని ఆయన పాత్ర నిడివిని పెంచాం. దాంతో లాక్ అయిన స్క్రిప్ట్‌లో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది. దాంతో కథలో గందరగోళానికి గురైంది. ఫ్యాన్స్‌ నుంచి కూడా అదే రివ్యూ వచ్చింది. మొదటి పార్ట్‌ అసలు అర్థం కాలేదని, గందరళగోళంగా ఉందన్నారు. దానికి కారణం స్క్రిప్ట్‌లో మార్పులు చేయడం వల్లే అలా అయ్యింది. నాన్న ఫ్యాన్స్‌  కోసం అలా చేస్తే అదే సినిమాకు మైనస్‌ అయ్యింది. ఇప్పుడు నా తప్పు అర్థమైంది. నెక్ట్స్‌ సినిమాకు ఈ తప్పు జరగకుండ చూసుకుంటాను" అంటూ ఐశ్వర్య వివరణ ఇచ్చింది.