Aishwarya Rai Bachchan: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది, ఆమె వ్యక్తిత్వ హక్కులను కాపాడటంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డీప్ ఫేక్ ల వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ఆమె పేరు, ఫొటోలను అనధికారికంగా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ  ఉత్తర్వును జారీ చేసింది.

Continues below advertisement

అనుమతి లేకుండా తన ఫొటోలు వినియోగిస్తున్నారంటా ఐశ్వర్యారాయ్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సెప్టెంబర్ 11న తీర్పునిచ్చింది న్యాయస్థానం. ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె ఫొటోలు వాడడానికి వీల్లేదని   ఆదేశించింది. ఐశ్వర్య ఫొటోలు దుర్వినియోగం చేయడం వల్ల ఆమెకు ఆర్థికంగా నష్టం కలిగించడమే కాకుండా ఆమె గౌరవం, ప్రతిష్ఠ ను దెబ్బతీసినట్లేనని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈమేరకు ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఐశ్వర్యారాయ్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం...అందులో గుర్తించిన URLలను తొలగించి బ్లాక్ చేయాలని ఇ-కామర్స్ వైబ్‌సైట్‌లను, గూగుల్‌ సహా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లను   ఆదేశించింది. 

 "ప్రసిద్ధ వ్యక్తి  గుర్తింపును వారి సమ్మతి లేదా అధికారం లేకుండా ఉపయోగించినప్పుడు, అది సంబంధిత వ్యక్తికి వాణిజ్యపరమైన నష్టానికి దారితీయవచ్చు,   వారి గౌరవంగా జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుంది" అని ధర్మాసనం పేర్కొంది.  కొత్త సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగానికి సంబంధించిన పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేస్తూ, కోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ AI, డీప్ ఫేక్ లు, మెషిన్ లెర్నింగ్ , ఫేస్ మార్ఫింగ్ లను నటి అనుమతి లేకుండా డిజిటల్ గా పునరుత్పత్తి చేయకుండా నిరోధించడానికి నిర్దిష్ట ఆదేశాలను జారీ చేసింది.

Continues below advertisement

జస్టిస్ కారియా ఏమన్నారంటే..   "ఒకరి వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా ఉపయోగించిన సందర్భాల్లో కోర్టులు ... సదరు అనధికారిక దోపిడీ వల్ల వారికి కలిగే నష్టాన్ని నివారించడానికి బాధితులకు అండగా నిలుస్తుంది.  ఒక నిర్దిష్ట బ్రాండ్ లేదా ఉత్పత్తిని సెలబ్రిటీ ఆమోదించినట్లు ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, దీనివల్ల వినియోగదారులలో  గందరగోళం ఏర్పడుతుందన్నారు.  

ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన పిటిషన్‌లో చెప్పినట్లుగా, వివిధ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు , కొందరు వ్యక్తులు ఆమె పేరు, ఫోటోలు, ఇమేజ్ ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారు. ఇది కమర్షియల్ లాభం కోసం, మోసపూరిత ప్రచారాలకు, సెక్సువల్ కంటెంట్ కోసం జరుగుతోంది.

Aishwarya Nation Wealth అనే కంపెనీ ఆమె ఫోటోను లెటర్‌హెడ్‌పై ఉపయోగించి, ఆమెను చైర్మన్‌గా తప్పుగా చూపించారు

aishwaryaworld.com వంటి సైట్‌లు ఆమె "అధికారిక వెబ్‌సైట్" అని ప్రకటించుకుని, వాల్‌పేపర్లు, ఫోటోలు విక్రయిస్తున్నాయి

ఆన్‌లైన్ మెర్చండైజ్: T-షర్ట్‌లు, మగ్‌లు, కాఫీ మగ్‌లు వంటివి ఆమె ఇమేజ్‌తో అమ్మకంలో ఉన్నాయి

AI , డీప్‌ఫేక్‌లు: మోర్ఫ్డ్ ఇమేజ్‌లు, అన్‌రియల్ ఇంటిమేట్ ఫోటోలు , పోర్నోగ్రాఫిక్ వీడియోలు సృష్టించి, ఆమె ఇమేజ్‌ను సెక్సువల్ డిజైర్‌లకు ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి కంటెంట్ వైరల్ అవుతోంది.

నోటీసులు అందిన 72 గంటల్లోపు పిటిషన్‌లో ఐశ్వర్య పేర్కొన్న యూఆర్‌ఎల్‌ బ్లాక్‌ చేయాలని పేర్కొంది.  ఆ యూఆర్‌ఎల్స్‌ను ఏడు రోజుల్లో బ్లాక్‌ చేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు కోర్టు సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 15న జరగనుంది.