Aishwarya Rai: అత్తా ఇలా.. కోడలు అలా - పెళ్లైన కొత్తలో ఐశ్వర్య ‘బచ్చన్’ రియాక్షన్ చూశారా?

రాజ్యసభలో జయా బచ్చన్ పేరుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అభిషేక్ తో పెళ్లి తర్వాత ఆమెను ఐశ్వర్య బచ్చన్ అని పిలవడం పట్ల ఎలా స్పందించిందో చూడండి..

Continues below advertisement

Aishwarya Rai Reaction On Rai Bachchan': రాజ్యసభలో తాజాగా  జయా బచ్చన్ పేరుపై వివాదం చెలరేగింది. రాజ్యసభ ఛైరన్ ఆమెను శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించడంపై ఆమె సీరియస్ అయ్యారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే చాలని వెల్లడించింది. తన పేరు విషయంలో కొత్త డ్రామా షురూ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సర్టిఫికేట్ లో ఉన్న పేరు ప్రకారమే తాము పిలిచామని, అలా పిలవడం ఇష్టం లేకపోతే పేరు మార్చుకోవాలని ఛైర్మెన్ సూచించడం చర్చనీయాంశంగా మారింది.

Continues below advertisement

పెళ్లైన కొత్తలో ఐశ్వర్య ‘బచ్చన్’ రియాక్షన్ ఏంటో తెలుసా?

రాజ్యసభలో జయా బచ్చన్ వివాదం నెలకొన్న నేపథ్యంలో సినీ నటి ఐశ్వర్యరాయ్ పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అభిషేక్ బచ్చన్ తో పెళ్లి తర్వాత జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమెను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు  'ఐశ్వర్య రాయ్ బచ్చన్' అంటూ పరిచయం చేసింది. తనను అలా పిలవడం పట్ల ఐష్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. “ఓహో... ఆ టైటిల్... మై గాడ్! జస్ట్ రెగ్యులర్ ఐశ్వర్య, మీరు అలాగే పిలవండి” అని చెప్పింది. “రాయ్ బచ్చన్ అధికారిక ఇంటిపేరేనా?” అని మరో ప్రశ్న అడిగినప్పుడు..  ఐశ్వర్య స్పందిస్తూ..  “వృత్తిపరంగా ఐశ్వర్య రాయ్. అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నాను. పెళ్లి తర్వాత ఐశ్వర్య బచ్చన్. పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు” అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. 2007 ఏప్రిల్ లో ఐశ్వర్య, అభిషేక్ వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఆరాధ్య బచ్చన్ అనే 13 ఏళ్ల కుమార్తె ఉన్నది.

రాజ్యసభలో జయా బచ్చన్ పేరుపై వివావం

రీసెంట్ గా రాజ్యసభలో చైర్మెన్ జగదీప్ ధన్ ఖర్ తన పేరును జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడంపై  ఎంపీ జయా బచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో సరికొత్త డ్రామా మొదలు పెట్టారంటూ ఆమె చురకలు వేశారు. “అమితాబ్ బచ్చన్ నా భర్త. ఆయనను చూసి గర్వపడుతున్నాను. కానీ, నన్ను ‘జయా అమితాబ్ బచ్చన్’ అని పిలవాల్సిన అవసరం లేదు. ‘జయా బచ్చన్’ అని పిలిస్తే చాలు. మహిళలకు సొంత గౌరవం అంటూ ఉందని గుర్తుంచుకోవాలి. మీరంతా ఓ కొత్త డ్రామా మొదలు పెట్టారు. గతంలో ఇలా ఉండేది కాదు” అంటూ జయా ఆగ్రహం వ్యక్తం చేశారు. జయా బచ్చన్ వ్యాఖ్యలపై  చైర్మెన్ ధన్ ఖర్ స్పందించారు. ఎన్నికల సర్టిఫికేట్ లో ఉన్న పేరునే తాము పిలిచామని, కావాలంటే పేరు మార్చుకునే నిబంధన కూడా ఉందని ఆయన వెల్లడించారు.  గతంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పైనా ఇదే విషయంపై జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొద్ది రోజుల్లోనే ఛైర్మెన్ మరోసారి అలా పిలవడంతో ఆమె కోపంతో ఊగిపోయారు.

Also Read: అందుకే టాప్ లేకుండా నటించాల్సి వచ్చింది, చాలా బాధపడ్డా: నటి అను అగర్వాల్

Continues below advertisement