Aishwarya Lekshmi: మెగా మేనల్లుడితో 'హనుమాన్' నిర్మాతలు చేస్తున్న సినిమాలో ఐశ్వర్య

Sai Durga Tej New Movie: సాయి దుర్గా తేజ్, పాన్ ఇండియా హిట్ 'హనుమాన్' నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. అందులో వసంతగా ఐశ్వర్య లక్ష్మీని ఎంపిక చేశారు.

Continues below advertisement

SDT 18 Movie Cast: 'విరూపాక్ష', 'బ్రో' సినిమాలతో మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ రూటు మార్చారు. ఆ రెండు సినిమాలు చూస్తే... రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ కాదు. ఇప్పుడు స్ట్రాంగ్ కంటెంట్ కథల వైపు చూస్తున్నారు సాయి తేజ్. 'హను మాన్'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ తమ ఖాతాలో వేసుకున్నారు నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. వీరి కలయికలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా ఐశ్వర్యను ఎంపిక చేశారు. 

Continues below advertisement

సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలైన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దంపతులు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు రోహిత్ కేపీ దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో కథానాయిక పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది. అందులో ఐశ్వర్య లక్ష్మి నటించనున్నారు.

Also Read: తమ్ముడికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!

Aishwarya Lekshmi Upcoming Movie: ఐశ్వర్య లక్ష్మి మలయాళీ అమ్మాయి. మలయాళంలో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత తమిళ సినిమాల్లోకి వచ్చారు. సత్యదేవ్ 'గాడ్ సే'తో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'లో పాత్ర ఆమెకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. సాయి తేజ్ సినిమా తెలుగులో ఆమెను ఎక్కువ మందికి చేరువ చేస్తుందని చెప్పవచ్చు.

Aishwarya Lekshmi Role In SDT 18 Movie: సాయి తేజ్ సినిమాలో వసంత పాత్రలో ఐశ్వర్య నటించనున్నట్టు చెప్పారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆమె క్యారెక్టర్ లుక్ వైవిధ్యంగా ఉంది. ఎడారి తరహా ల్యాండ్‌ స్కేప్‌లోని పోస్టర్‌లో ఐశ్వర్య లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?


ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన మ్యాసీవ్ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హై ఆక్టేన్ పీరియడ్ యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మెగా మేనల్లుడు సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Readవిజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి

Continues below advertisement
Sponsored Links by Taboola