ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీని బాగా డిసప్పాయింట్ చేసిన డిజాస్టర్స్ లో అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సుమారు రూ.80 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. అయితే ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. నిజానికి ప్రేక్షకులు, విమర్శకులు ఈ సినిమా ఫుల్ రన్ లో కనీసం మీడియం సక్సెస్ అయినా అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే ఇప్పటికీ ఈ సినిమాపై ఇంకా కొన్ని కొత్త సమస్యలు మూవీ టీం ని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ మూవీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ఓటిటి కోసం ఏజెంట్ కొత్త వర్షన్ రెడీ చేస్తున్నారు.
ఇప్పటికే ల్యాగ్ అనిపించిన కొన్ని సన్నివేశాలను తొలగించారట. స్క్రీన్ ప్లే లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. దాంతోపాటు డిలీట్ చేసిన కొన్ని సన్నివేశాలను సైతం జోడిస్తున్నారట. అలా మొత్తంగా ఓ సరికొత్త వెర్షన్ ని ఓటీటీ కోసం ఏజెంట్ టీమ్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏజెంట్ ఓటిటి హక్కులను కొనుగోలు చేసిన సోనీ లీవ్ దర్శకుడు సురేందర్ రెడ్డిని హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం మరి కొన్ని కట్స్ తో ఓ కొత్త వెర్షన్ ని సిద్ధం చేయమని కోరినట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం ఒరిజినల్ వెర్షన్ కి ఎలాంటి కట్స్ చేయలేనని ఇప్పటివరకు ఓటీటీ కోసం తాను రెడీ చేసిన వెర్షన్ చాలా బెటర్ గా ఆడియన్స్ కి ఆకట్టుకునే విధంగా ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే సోనీ లీవ్ ఓటిటి టీం మాత్రం ఏజెంట్ డిజిటల్ వర్షన్ మరింత బాగా వర్కౌట్ అయ్యేలా రీ కట్ చేయడానికి ఏకంగా ఎడిటర్లను సైతం నియమించుకున్నారని తెలుస్తోంది.
తమ సబ్స్క్రైబర్ల కోసం బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి సోనీ లీవ్ ఈ రీకట్ వెర్షన్ పై మరింత దృష్టి పెట్టినట్లు సమాచారం. జూన్ చివరి వారంలో ఏజెంట్ మూవీ సోనీ లివ్ ఓటిటిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రీ కట్ వెర్షన్ తో ఏజెంట్ మూవీ ఓటీటీ లో నైనా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. నిజానికి ఏజెంట్ మూవీ ప్లాప్ అవ్వడానికి ఎడిటింగ్ వర్క్ సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణమే. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డి స్వయంగా సోనీ లీవ్ వాళ్లకి ఓ కొత్త వెర్షన్ ని రెడీ చేసి ఇస్తున్నారట. లేకపోతే ఏజెంట్ డిజిటల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసిన సోనీ లీవ్ సంస్థ ముందు రిజల్ట్ చూసి భయపడి అగ్రిమెంట్ మళ్లీ తిరిగి రాసుకుందామని చెప్పడమే కాకుండా గతంలో కంటే తక్కువ అమౌంట్ సైతం కోట్ చేశారట. ఈ క్రమంలోనే రేటు మార్చకుండా ఇప్పుడు మూవీ టీం సోనీ లివ్ వాళ్ళతో కలిసి రీ ఎడిట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రీ ఎడిట్ వెర్షన్ అయినా వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Also Read: 'ది నైట్ మేనేజర్' పార్ట్ 2 వచ్చేస్తోంది - ఉత్కంఠ భరితంగా ట్రైలర్!