ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? - 'కేజీఎఫ్'లోని ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోని హీరో, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన కొత్త సినిమా 'టాక్సిక్'ను వాయిదా వేసే సరికి ఆ ప్రశ్న మెగా అభిమానులకు, మరీ ముఖ్యంగా 'పెద్ది' చిత్ర బృందానికి ఎదురు అవుతోంది. జూన్ 4వ తేదీ రిలీజ్ స్లాట్ ఖాళీగా ఉండటంతో 'పెద్ది' ముందుకు వస్తాడా? లేదా వెనక్కి వెళతాడా? అనే డిస్కషన్ మొదలు అవుతోంది. అందుకు కారణం... 'టాక్సిక్' వాయిదా గురించి యశ్ పోస్ట్ చేయడం, దానికి కొన్ని గంటల ముందు 'లెనిన్' రిలీజ్ డేట్ మరోసారి కింగ్ అక్కినేని నాగార్జున కన్ఫర్మ్ చేయడం జరిగాయి కనుక!

'పెద్ది' కోసం వెనక్కి వెళ్లిన 'లెనిన్''పెద్ది' సినిమా విడుదలను ఇప్పటికి రెండుసార్లు వాయిదా వేశారు. తొలుత ఈ సినిమా మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. ఆ తేదీకి సినిమా రాలేదు. అక్కడ నుంచి ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా విడుదల కావడం లేదు అనుకోండి. అయితే... ఏప్రిల్ 30కి 'పెద్ది' వచ్చినప్పుడు మే 1న అఖిల్ అక్కినేని 'లెనిన్' విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఉండటంతో తమ సినిమాను వాయిదా వేశామని 'లెనిన్' మేకర్లు అనౌన్స్ చేశారు. కట్ చేస్తే... ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకు 'పెద్ది' కూడా వాయిదా పడింది. 

'లెనిన్' కోసం 'పెద్ది' ముందుకొస్తే?మే 1వ తేదీ నుంచి వాయిదా వేసిన 'లెనిన్'ను జూన్ 26న విడుదల చేస్తామని చిత్ర బృందం చాలా రోజుల క్రితం అనౌన్స్ చేసింది. అయితే... అప్పటికి 'పెద్ది'తో క్లాష్ అనే మాట లేదు. ఆ తర్వాత 'పెద్ది' కూడా వాయిదా పడింది. ఇటీవల ధనుష్ 'కర' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమ సినిమాను జూన్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేశామని 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సానా చెప్పారు. దాంతో మరోసారి రామ్ చరణ్ కోసం 'లెనిన్'ను వాయిదా వేస్తారా? అనే అనుమానాలు వచ్చాయి. అయితే ఈ రోజు (ఏప్రిల్ 29, 2026న) నాగార్జున చేసిన ట్వీట్ బట్టి... 'లెనిన్'ను వాయిదా వేసే ఆలోచనలు లేవు. 'లెనిన్' రిలీజ్ డేట్ మరోసారి ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాత 'టాక్సిక్'ను వాయిదా వేసినట్టు యశ్ ట్వీట్ చేశారు.

Also ReadLenin First Review: కొత్త అఖిల్‌ను చూస్తారు - 'లెనిన్' చూసిన నాగార్జున... ఫస్ట్ రివ్యూ ఇదిగో

ఇప్పుడు జూన్ 4వ తేదీ స్లాట్ ఖాళీగా ఉంది. 'టాక్సిక్' కోసం ఉంచిన థియేటర్లలో ఓ పెద్ద సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేసుకోవడానికి వీలు ఉంది. మరి, ఆ తేదీకి 'పెద్ది' వస్తుందా? లేదా? అనేది ఆ చిత్ర బృందమే చెప్పాలి.

Also ReadAshu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున మధ్య ఉన్న స్నేహం గురించి తెలుగు చిత్రసీమలోని ప్రముఖులతో పాటు ప్రేక్షకులకూ తెలుసు. అలాగే... రామ్ చరణ్, అఖిల్ అక్కినేని కూడా మంచి స్నేహితులు. అందువల్ల, తమ సినిమాల మధ్య పోటీ లేకుండా చూస్తారా? లేదంటే ఒక్క రోజు వ్యవధిలో 'పెద్ది' & 'లెనిన్' సినిమాలను తీసుకు వస్తారా? అక్కినేని, కొణిదెల కుటుంబాలు డిస్కస్ చేసుకుని ఏం చేస్తాయి? అనేది చూడాలి.

Also ReadSreenivasa Kavyanam: తిరుమలలో శ్రీనివాస కళ్యాణం... కావ్యతో బెల్లంకొండ పెళ్లి ముహూర్తం నుంచి రిసెప్షన్ వరకూ... ఆల్ డీటెయిల్స్‌ తెలుసుకోండి