ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' థియేటర్లలోకి వస్తుందని ఆ రిలీజ్ డేట్ వైపు ఎవరూ చూడలేదు. అనూహ్యంగా ఆ సినిమా వాయిదా పడింది. తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' చిత్ర బృందానికి అది తెలిసి మే 1న తమ సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేసింది. ఇప్పుడీ సమ్మర్ రేసులో మరొక సినిమా వచ్చి చేరింది. అది సత్య 'జెట్లీ'.

మే 1న థియేటర్లలోకి 'జెట్లీ''మత్తు వదలరా'లో సత్య కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న మరో సినిమా 'జెట్లీ'. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దామల్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోన్న ఈ సినిమాను మే 1న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

Also ReadBad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

'జెట్లీ' సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫన్ గ్లింప్స్‌, సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్‌ మంచి స్పందన అందుకున్నాయని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

Also ReadPapam Prathap Movie Review - పాపం ప్రతాప్ రివ్యూ: థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు చూసి పాపం అనుకోవాలా?... తిరువీర్ సినిమా ఎలా ఉందంటే?

సత్య, రియా సింఘా జంటగా... 'వెన్నెల' కిషోర్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇంకా దర్శకత్వం: రితేష్ రానా, నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ) - హేమలత పెదమల్లు, సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్ (నవీన్ ఎర్నేని - రవిశంకర్ యలమంచిలి), కథ - స్క్రీన్‌ ప్లే: రితేష్ రానా & జయేంద్ర ఎరోలా, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్: తేజ ఆర్, యాక్షన్ కొరియోగ్రాఫర్: వింగ్ చున్ అంజి.

Also ReadThimmarajupalli TV Movie Review - తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ: టీవీ కోసం అంత గొడవంటే నమ్మేట్టు ఉందా? నిర్మాతగా కిరణ్ అబ్బవరం సినిమా హిట్టేనా?