Shine Tom Chacko Revealed He Has ADHD: ఇండస్ట్రీలో లవ్‌, బ్రేకప్‌, పెళ్లి, విడాకులు కామన్‌. కానీ, ఓ నటుడు నిశ్చితార్థానికి ముందే బ్రేకప్‌ చెప్పారు. ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతాడా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి నిశ్చితార్థం రద్దయ్యిందని చెప్పి షాకిచ్చారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు షైన్‌ టామ్‌ చాకో. దసరా సినిమాలో విలన్‌గా నటించారు. ఇందులో చిన్న నంబిగా టెర్రిఫిక్‌ రోల్లో భయపెట్టారు. ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి' సినిమాలోనూ విలన్‌గా నటించాడు. అలా వరుసగా తెలుగులో ఆఫర్స్‌ అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా చిత్రం దేవరలో కీలక రోల్‌ చేస్తున్నాడు.


మలయాళంలోనూ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో షైన్ మలయాళ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన పెళ్లి ఎప్పుడని హోస్ట్‌ ప్రశ్నించగా.. తన నిశ్చితార్థం క్యాన్సిల్‌ అయ్యిందని చెప్పి షాకిచ్చారు. అంతేకాదు తనకు ఉన్న అరుదైన వ్యాధి గురించి బయటపెట్టారు. తాను ఓ అరుదై వ్యాధితో పడుతున్నానని, కానీ ఇదే తన బెస్ట్‌ క్యాలిటీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన ఏ ఇంటర్య్వూ, వీడియోలో చూసిన ఆయన చిన్నపిల్లాడిలా బిహేవ్‌ చేస్తుంటారు. దీనివల్ల షైన్‌ టామ్‌ చాకో తరచూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో షైన్‌ తన వ్యాధి గురించి బయటపెట్టారు. 


"నాకు అరుదైన వ్యాధి ఉంది. నేను ఏడీహెచ్‌డీ (ADHD) కిడ్‌ని. ఈ వ్యాధి బారిన పడినవారు ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది నటులలో సాధారణంగా ఉండే లక్షణమే. కానీ బయటి వారికి ఇదోక రుగ్మతలా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ ఇతరుల అటెన్షన్‌ కోరుకుంటారు. చూట్టూ ఉన్న వ్యక్తులు తమని ప్రత్యేకంగా గుర్తించాలని కోరుకుంటారని. బయటి వారికి ఇది ఓ రుగ్మతగా అనిపించవచ్చు కానీ, నా వరకు ఇది బెస్ట్‌ క్వాలిటీ" అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. 41 ఏళ్ల వయసులో ఈ వ్యాధిలో బారిన పడినట్టు చెప్పారు. దీనివల్ల దేనిపై ఎక్కవు సరిగా శ్రద్ధ పెట్టలేకపోవడం, అతి ప్రవర్తన తొందరగా ఆవేశపడటం వంటివి తనలో గమనించానని చెప్పారు. 



ADHD లక్షణాలు ఇవే..


ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తాయి. చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకపోవడం, అతిగా మాట్లాడటం, మతిమరుపు.. అజాగ్రత్తగా ఉండటం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అందరిలో సాధారణంగా ఉండే లక్షణాలే. కానీ ఈ వ్యాధి బారిన పడినవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఒక్కచోట కుదురుగా ఉండరు.. కాళ్లు, చేతులు కదిలిస్తూ ఉంటారు. ఎక్కువగా పరుగెత్తడం, గెంతడం, తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాల ఎక్కువగా ఉండటం వల్ల వారి వల్ల పక్కన ఉండేవారు ఇబ్బంది పడుతుంటారు. ఇక ఇతరుల వస్తువులు అనుమతి లేకుండ తీసుకోవడం వంటి లక్షణం ఎక్కువగా ఉంటే ఏడీహెచ్‌డీ సమస్యతో బాధపడుతున్నట్టే అనే గుర్తించాలి. 



Also Read: పవన్‌ కళ్యాణ్‌-రవితేజతో మల్టీస్టారర్‌ - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌