Prahlad Kakkar Aabout Priyanka Chopra: ప్రహ్లాద్ కక్కర్ భారతీయ యాడ్ ఫిల్మ్‌మేకర్ , డైరెక్టర్. ఎక్కువగా టీవీ కమర్షియల్స్‌తో ప్రసిద్ధి చెందారు.. బాలీవుడ్‌లో కొన్ని చిన్న సినిమాలను డైరెక్ట్ చేశారు ప్రియాంక చోప్రా జోనాస్ గ్లోబల్ స్టార్, మిస్ వరల్డ్ 2000 విన్నర్, బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటిన హీరోయిన్. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి SSMB 29 లో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఇద్దరి పేర్లు ట్రెండింగ్ లో ఉన్నాయ్..ఎందుకంటే.. ఇంటర్యూ లో మాట్లాడిన ప్రహ్లాద్ కక్కర్ ...ప్రియాంక చోప్రా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమెకు గతంలో సీరియస్ అఫైర్ ఉండేదని..చాలా పర్సనల్ గా తీసుకుందామె..అందుకే అప్పట్లో విషయం బయటకు రాకూడదని, ఎవరూ రాయకూడదని , మాట్లాడకూడదని కోరుకుందని చెప్పారు. ప్రియాంక చోప్రా అఫైర్ ఎవరితో అనే విషయం ప్రహ్లాద్ కక్కర్ వెల్లడించలేదు కానీ..షారుక్ ఖాన్ తోనే అయి ఉంటుందని బీటౌన్ వర్గాలు డిస్కస్ చేసుకుంటున్నాయ్. డాన్ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీకి ఫుల్ మార్క్స్ పడ్డాయ్. సినిమా టైమ్ నుంచి ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ రూమర్స్ వచ్చాయ్.

కక్కర్... విక్కీ లాల్వానీతో మాట్లాడుతూ, "ప్రియాంకా ఒక డాల్... ఆమెతో కలిసి పనిచేయడం గొప్ప విషయం. ఆమె చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది, మంచి మనసు ఆమెది. చేసే పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెడుతుంది అదే కెరీర్లో ఆమెను ఉన్నత శిఖరానికి చేరేలా చేసిందని కొనియాడారు ప్రహ్లాద్. ఆమె ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు..ఇతరులను ఆమె వ్యవహారాల్లోకి అడుగుపెట్టనివ్వరు..అందుకే ఆమె అఫైర్ గురించి ఎవ్వరూ బయటకు మాట్లాడలేదన్నారు ప్రహ్లాద్ కక్కర్.

ప్రియాంక చోప్రా కెరీర్ ఎలా ప్రారంభమైందో ఇంటర్యూలో ప్రస్తావించారు కక్కర్.. 2000 ఫెమినా మిస్ ఇండియా పోటీలలో లారా దత్తాతో తన పోటీని గుర్తుచేసుకున్నారు. లారా ప్రధాన టైటిల్ గెలుచుకోగా, ప్రియాంకా మొదటి రన్నరప్‌గా నిలిచింది, అదే సంవత్సరం ఇద్దరూ ప్రధాన అంతర్జాతీయ పోటీ టైటిల్స్ సాధించారు. వాస్తవానికి అప్పట్లో ప్రియాంకాకు చాలా ప్రతికూలతలు ఉన్నాయి. ఆమె నల్లగా ఉండేది, స్కిన్ సమస్యలున్నాయి..అందుకే చాలావరకూ స్కిన్ కవర్ చేయాల్సి వచ్చేది. అలాంటి ప్రతికూలతను అధిగమించేందుకు చాలా కష్టపడింది. రిస్క్ తీసుకోవడం ద్వారానే విజయం అందుకుంటాం అని నమ్మింది. అందుకోసం మానసికంగా, శారీరకంగా దృఢంగా మారిందన్నారు.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న టైమ్ లో హాలీవుడ్ కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవడం..అక్కడ నిలదొక్కుకోవడం నిజంగా సాహసోపేతమైన చర్యే అన్నారు కక్కర్. ఆమెకు ఏజ్ పెరిగిందని బాలీవుడ్ లో కామెంట్స్ వస్తున్న టైమ్ లో హాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రూవ్ చేసుకుంది. కష్టమే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగే అవకాశాన్నిచ్చిందని ప్రియాంక హార్డ్ వర్క్ ను ప్రశంసించారు కక్కర్. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి మూవీతో బిజీగా ఉంది.

ఇదే ఇంటర్యూలో ప్రహ్లాద్ కక్కర్ ఐశ్వర్యా రాయ్, సుష్మితా సెన్ వంటి హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడారు. విక్కీ లాల్వానీతో జరిగిన ఈ ఇంటర్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.