Trisha Krishnan Reaction On Marriage Rumours: స్టార్ హీరోయిన్ త్రిష అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నాలుగు పదుల వయసు దాటినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో ఎప్పుడూ రూమర్స్ హల్చల్ చేస్తూనే ఉంటాయి. పలు సందర్భాల్లో త్రిష వీటిని డైరెక్ట్‌గానే ఖండించినా రూమర్స్ మాత్రం ఆగవు. తాజాగా మరోసారి పెళ్లి వార్తలు వైరల్ కాగా ఆమె రియాక్ట్ అయ్యారు.
చంఢీగఢ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌తో త్రిష వివాహం ఫిక్స్ అయ్యిందంటూ రూమర్స్ వచ్చాయి. ఇరువురి కుటుంబాల్లో పెద్దల అంగీకారంతో వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారంటూ ప్రచారం సాగింది. దీనిపై ఇన్ స్టా వేదికగా త్రిష స్పందించారు. ఫన్నీ పోస్టుతోనే ఆ వార్తలకు చెక్ పెట్టారు.
ఫన్నీ పోస్ట్
పెళ్లి రూమర్లపై రియాక్ట్ అవుతూ... 'నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న అందరినీ నేను ప్రేమిస్తాను. ఇప్పుడు నా హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమో అని వెయిట్ చేస్తున్నా.' అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది. ఒక్క పోస్టుతోనే పెళ్లి రూమర్లకు చెక్ పెట్టేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, త్రిషకు 2015లో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఇరువురూ ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారు.
ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా మారారు. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా... వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూర్య 'కరుప్పు' మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు.
Also Read: లవ్ చేస్తే లైఫ్ ఇస్తా - కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ట్రైలర్