Actress Shraddha Das About Her Love: వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా మారిపోయింది హీరోయిన్ శ్రద్ధాదాస్. వెండితెరతో పాటు బుల్లితెరపైనా ప్రేక్షకులను అలరిస్తోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘పారిజాత పర్వం’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో శ్రద్ధాదాస్ తో పాటు చైతన్య రావు, సునీల్, వైవా హర్ష, మాళవిక సతీశన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 19న విడుదలైన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది.   


లవ్ లో ఉన్నా, పెళ్లి కాలేదు- శ్రద్ధాదాస్


‘పారిజాత పర్వం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చింది. “నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాడే. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం తెలుసు. కానీ, అతడు ఎవరు? అనే విషయాన్ని బయటకు చెప్పను. మాకు పెళ్లి అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పటి వరకు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. లవ్ లెటర్స్ కూడా ఇచ్చారు. నేను సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ వాడుతున్నాను. ఆ అకౌంట్ ఏది అనేది చెప్పను. నేను వారానికి ఓ టూత్ బ్రష్ మార్చుతాను. రోజుకు మూడుసార్లు స్నానం చేస్తాను. టాటూస్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు” అని చెప్పుకొచ్చింది.


‘పారిజాత పర్వం’ శ్రద్ధా ఏం చెప్పిందంటే?


‘పారిజాత పర్వం’ సినిమాలో నటనకు ఆస్కారం క్యారెక్టర్ చేసినట్లు శ్రద్ధాదాస్ వెల్లడించింది. “కాస్త గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేశాను. యాక్టింగ్ కు ఆస్కారం ఉన్న క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా పాత్ర నా ఒరిజినల్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉంటుంది. నా కోసం దర్శకుడు ఈ క్యారెక్టర్ చక్కగా రూపొందించాడు. సునీల్, వైవా హర్ష, చైతన్యతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. వాళ్ల కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. వారి లాగే చేసేందుకు ట్రై చేశాను” అని చెప్పింది. 


వరుస సినిమాలో ఫుల్ బిజీ


శ్రద్ధాదాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. మంచు లక్ష్మి, అనన్య నాగళ్లతో కలిసి ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమా చేస్తోంది. ‘అర్థం’ అనే సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. హారర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు మణికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Read Also : ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం