Rashi Singh Reaction About Her Inter Love With Lecturer : ఇంటర్ టైంలో తన కాలేజీ లెక్చరర్‌తో ప్రేమలో పడినట్లు హీరోయిన్ రాశీ సింగ్ తెలిపారు. '3 రోజెస్' వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన కాలేజీ రోజుల్లో లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు.

Continues below advertisement

లెక్చరర్‌తో లవ్... టైం పాస్ చేశాం

స్కూల్ డేస్ అయిపోయాక కాలేజీలో చేరానని... అక్కడ తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పారు రాశీ సింగ్. 'ఆతను మా లెక్చరర్ కూడా. నాకు ఎంతో ఫేవర్ చేసేవాడు. పరీక్షల టైంలో నాకు క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చేవాడు. వైవా టైంలో ఏం అడిగేవాడు కాదు. ఇద్దరం కూర్చుని 10 నిమిషాలు టైం పాస్ చేసేవాళ్లం. నన్ను ఏమీ అడిగేవారు కాదు. అప్పుడు నా ఏజ్ 17 ఏళ్లు. అతను చాలా యంగ్. కానీ ఏం అవ్వలేదు. ఇప్పుడు అతనికి పెళ్లి అయిపోయింది. నన్ను ఇన్ స్టాలో కూడా ఫాలో అవుతున్నాడు.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

నెటిజన్ల ట్రోలింగ్స్

అయితే, రాశీ సింగ్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్లలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అంటున్నారు.

Also Read : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?

'శశి' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ సింగ్... ఆ తర్వాత ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ మూవీస్‌లో నటించారు. రీసెంట్‌గా రాజ్ తరుణ్ హీరోగా నటించిన పాంచ్ మినార్‌లోనూ నటించి మెప్పించారు. ఇక లేటెస్ట్‌గా రొమాంటిక్ వెబ్ సిరీస్ '3 రోజెస్' సీజన్ 2 లోనూ కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటే ఈషా, కుషిత కుల్లపు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.

స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సరికొత్త సీజన్‌లో సత్యం రాజేష్, సాయి రోనక్, హర్ష చెముడు, సౌరభ్ దింగ్రా, సంగీత్ శోభన్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరించగా కిరణ్ దర్శకత్వం వహించారు. 'బేబీ' ప్రొడ్యూసర్ SKN సిరీస్ నిర్మించారు. ఈ నెల 12 నుంచి 'ఆహా' ఓటీటీ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.