Actress Kasthuri About Commitments: తనకు నచ్చింది చెప్పడంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటుంది సీనియర్ నటి కస్తూరి శంకర్. నెటిజన్లనే కాదు, సినీ పరిశ్రమలో ఉన్న వారిని సైతం ఏకిపారేయడంలో ముందుంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే అని తేల్చి చెప్తున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారిని ఎదిరించడం వల్ల సమస్యలు వస్తాయాని తెలిసినా, తగ్గేది లేదంటారు కస్తూరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు.


తానెప్పుడూ అవాస్తవాలు ప్రచారం చేయలేదని చెప్పారు. “నేను ఎప్పుడైనా నిజమే చెప్తాను. ఫేక్ విషయాలు చెప్పుడూ చెప్పను. నేను అడిగే ప్రశ్నలు కూడా వ్యాలిడ్ గా ఉంటాయి. కొన్నిసార్లు నేను అడిగే ప్రశ్నలు కొన్నిసార్లు కొంత మందిని ఇబ్బంది పెట్టొచ్చు.. పెట్టనీయండి. నేను ఎప్పుడూ మర్యాద లేకుండా మాట్లాడలేదు. ప్రకాష్ రాజు గారే దానికి ఉదాహరణ. ఆయనకు ఓ పొలిటికల్ ఐడియాలజీ ఉంది. తను ఎవరినైనా ఏకవచనంతో మాట్లాడుతారు. పెద్ద పెద్ద వారి గురించి కూడా ఆయన అలాగే మాట్లాడుతారు. అలాంటి ఆటిట్యూడ్ నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలంటే మర్యాదగా చెప్పాలి. క్రిటిసైజ్ తప్పులేదు. కానీ, చెప్పేవిధానం పద్దతిగా ఉండాలి. నువ్వు దొంగ అని కాకుండా మీరు దొంగ అనండి. నా మాటలు నాకు సినిమా అవకాశాలు రాకుండా చేసి ఉండవచ్చు. అయినా, నిజం మాట్లాడకుండా ఉండలేను. ఇప్పుడు నాకు అవకాశాలు వచ్చినా ఓకే. రాకపోయినా ఓకే” అని చెప్పుకొచ్చారు.


మీటూ ప్రచారం అంతా మీడియాలోనే - కస్తూరి


సినిమా పరిశ్రమలో కమిట్మెంట్ ఘటనలు కేవలం ప్రచారాలేనని చెప్పారు. మీడియా రేటింగ్ కోసం చేసే ప్రచారం తప్ప ఏమీ లేదన్నారు. “మీటూ ఘటనలు, కమిట్మెంట్ ఘటనలు అప్పుడు లేవు. ఇప్పుడు లేవు. కేవలం మీడియాలోనే ఉన్నాయి. ఎక్కడో ఒక్కచోట జరిగిన ఘటనను పూర్తి ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదన్నారు. ఇలాంటి వార్తలు అప్పుడూ రాసేవాళ్లు. ఇప్పుడూ రాస్తున్నారు. మీడియాకు అదో డబ్బులు కురిపించే టాపిక్. అందులో వాస్తవం అనేది చాలా తక్కువగా ఉంటుంది” అని వెల్లడించారు.


విలువలు పాటించకుండా ఆ ఫోటోలు పబ్లిష్ చేశారు- కస్తూరి


ఇక తన కొడుకుని ఎత్తుకుని చేసిన ఫోటో షూట్ కాంట్రవర్శియల్ కావడం పట్ల కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొడుకును ఎత్తుకుని చేసిన ఫోటో షూట్ బాగా వైరల్ అయ్యింది. ఆ ఫోటోలను పబ్లిష్ చేసే విషయంలో మీడియా ఎలాంటి ఎథిక్స్ పాటించలేదు. ఆ ఫోటోలను పబ్లిష్ చేసేందుకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. డెలివరీ తర్వాత తల్లుల బాడీ మొత్తం మారిపోతుంది. దాని మీద అవగాహన కల్పించేందుకే ఆ ఫోటో షూట్ చేశాను. అది కూడా ‘అమెరికన్ విమెన్’ కోసం చేశాను. ఆ ఫోటోలను ఇక్కడ పబ్లిష్ చేసిన ఏ సంస్థను నేను గౌరవించను. ఆ సంస్థలకు ఎలాంటి ఎథిక్స్ లేవు. వాటిలో కొన్ని ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ఒకే ఒక్క సంస్థ నన్ను పర్మిషన్ అడిగింది. నేను ఇచ్చాను. ఆ పత్రిక కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వార్త రాసింది. ఇక్కడ ఏదైనా మంచి విషయం కోసం ప్రయత్నం చేసినా చెడుగా మాట్లాడుతారు. ట్రోల్ చేస్తారు” అని కస్తూరి వివరించారు.


Read Also: నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే నేను దురదృష్టవంతురాలిని ఎలా అవుతాను - రేణు దేశాయ్