Divya Agarwal clarifies on her Divorce: ఈ మధ్య ఇండస్ట్రలో విడాకుల వార్తలు బాగా వినిపిస్తున్నాయి. బుల్లితెర నుంచి వెండితెర వరకు తరచూ ఎవరో ఒక సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇది మరి ఎక్కువ అయ్యింది. నాగచైతన్య - సమంతల తర్వాత పలువురు స్టార్స్‌ వరుసగా విడాకులు వార్తలు ప్రకటించారు. నిజానికి బాలీవుడ్‌ విడాకులు అనేవి కామన్‌.కానీ సౌత్‌లోనూ ఇప్పుడిది కామన్‌ అయిపోయింది. ఆ మధ్య హీరో ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాకిచ్చారు.


రీసెంట్‌గా కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్‌, గాయనీ సైంధవిలు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే టాలీవుడ్‌ బుల్లితెర నటి శీరిష భర్తతో విడిపోయినట్టు వెల్లడిచింది. ఇలా నెలల వ్యవధిలోనే సెలబ్రిటీల విడాకులు వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరో నటి విడాకులు బాట పట్టిందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేయడమే. బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఓటీటీ విన్నర్‌ దివ్య అగర్వాల్‌ ఇటీవలె పెళ్లి పీటలు ఎక్కింది.


ఆమె పెళ్లై మూడు నెలల కూడా తిరక్కుండానే భర్తతోవ విడిపోతుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.  దివ్య కొన్నిరోజుల కిందట ఇన్‌ప్టాగ్రామ్‌ నుంచి పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేసింది. పెళ్లయిన మూడు నెలలకు పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేయడంతో అంతా షాక్‌ అయ్యారు. మొన్నే తనని అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ మురిసిపోతూ సోషల్‌ మీడియా పోస్ట్‌ షేర్‌ చేసింది. అంతలోనే విడాకులు ఏంటని ఫ్యాన్స్‌ అంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ వార్త కాస్తా దివ్వ కంటపడింది. తన వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లపై స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్‌ చేసింది. "నేను ఏం మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు. ఎలాంటి స్టోరీ కూడా పెట్టలేదు. కేవలం నా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి 2500 పోస్ట్స్‌ డిలిట్‌ చేశాను.


కానీ ఈ మీడియాలో మాత్రం నా పెళ్లి పోస్ట్స్‌నే ఫోకస్ చేసింది. ఇదంతా చూస్తుంటే నాకు చాలా నవ్వోస్తుంది. నేనేప్పుడు ఎవరూ ఊహించనవి చేస్తుంటాను. మరి ఇప్పుడు నా నుంచి ఏం కోరుకుంటున్నారు పిల్లలా? విడాకులా?. కానీ అది ఇప్పుడు అస్పలు జరగదు" అంటూ దివ్య ఘాటుగా స్పందించింది. ఇలా ఒక్క పోస్ట్‌తో తన విడాకులపై వార్తలపై వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ హమ్మయ్య అని ఊపిరి పీల్చకుంటున్నారు. కాగా దివ్వ అగర్వాల్‌ నటి మాత్రమే కాదు మోడల్‌ కూడా. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఈ తర్వాత పలు రియాలిటీ షోలలో పాల్గొంది. అలా బిగ్‌బాస్‌ ఓటీటీతో లైమ్‌లైట్లోకి వచ్చింది. హిందీ బిగ్ బాస్ OTT సీజన్‌ వన్‌ విజేతగా నిలిచిన దివ్య అంతకు ముందు  MTV స్ప్లిట్స్‌విల్లా 10 రియాలిటీ షోలో పాల్గొని రన్నరప్‌గా అయ్యింది. అలాగే ఆఫ్ స్పేస్ వన్ విజేతగా నిలిచింది.


Also Read: నా భర్తతో విడాకులు తీసుకున్నా - కావాలనే ఆమె నా కూతురని ప్రచారం చేశారు..