Actress Archana Shastry Interview : టాలీవుడ్ నటి అర్చన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన అర్చన.. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ తోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్ సరసన 'నేను' సినిమాలో హీరోయిన్‌గా నటించిన అర్చన ఆ తర్వాత 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'ఖలేజా', 'శ్రీరామదాసు' లాంటి మరెన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసి పాపులర్ అయింది. మధ్యలో గ్లామర్ రోల్స్ కూడా చేసింది. శివాజీతో కలిసి 'కమలతో నా ప్రయాణం' అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. అయితే ఈమధ్య అర్చన ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు ఫీల్ అవ్వడానికి ఏం ఉండదు..
సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేసేటప్పుడు మీరు కేవలం నటనగానే భావిస్తారా? లేక ఫీల్ తో చేస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అర్చన ఇలా సమాధానం ఇచ్చింది. "ఫీల్ అవ్వడానికి అక్కడేం ఉండదు. ఎందుకంటే సెట్స్ లో చుట్టూ చాలా మంది ఉంటారు. ఫీల్ అవుతూ చేయకపోయినా హారిబుల్ గా అనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. రొమాంటిక్ సీన్స్ బాగా రాకపోతే చూడడానికి అసలు బాగోదు. జనాలు నవ్వుకుంటారు" అని అన్నారు.
నేనైతే రొమాన్స్ చేసేటప్పుడు అలా ఫీల్ అవుతా
"నేనైతే ఓ హీరోతో రొమాన్స్ చేసేటప్పుడు అతన్ని ఓ వస్తువులా మాత్రమే భావిస్తా. ఫీల్ అవుతూ రొమాన్స్ చేయను. నేను చాలా సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేశాను. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా రొమాంటిక్ కాదు కదా.. ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితి అలా ఉంటాయి. నేను రొమాన్స్ చేసేటప్పుడు ఫీల్ అవ్వాలంటే ముందు నాతో రొమాన్స్ చేసే వ్యక్తిని నావాడిగా భావించాలి. అప్పుడే నాకు ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా సీన్ చేసే ముందే మనం మైండ్ లో ఫిక్స్ అయిపోతాం కాబట్టి నా వరకు అలాంటి ఫీలింగ్ రాదు" అని చెప్పింది.
ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ అన్నీ ఒకే టేక్ లో చేసాం
బోల్డ్ సీన్స్ గురించి చెప్తున్న క్రమంలో శివాజీతో అర్చన నటించిన 'కమలతో నా ప్రయాణం' అనే సినిమా గురించిన ప్రస్తావన రాగా అర్చన ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ చేయడం గురించి మాట్లాడుతూ.. "కమలతో నా ప్రయాణం సినిమాలో నాది వేశ్య పాత్ర ఆ పాత్రకు తగ్గట్టు న్యాయం చేయాలి. సో సినిమాలో బోల్డ్ సీన్స్ చేసే ముందే నేను, శివాజీ ఇద్దరం ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే ఆ సీన్స్ అన్నీ సింగిల్ టేక్ లో కంప్లీట్ అవ్వాలని ముందే ఇలా చేయాలి.. అలా చేయాలని కంపోజ్ చేసుకునే వాళ్ళం. అలా కమలతో నా ప్రయాణం సినిమాలో ఉన్న బోల్డ్ సీన్స్ మొత్తం సింగిల్ టేక్ లో ఓకే అయ్యేవి. వేరే యాక్టర్స్ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. కానీ నా వరకు అది జస్ట్ ఓ సీన్ మాత్రమే" అని తెలిపింది.
పెళ్ళైన హీరోతో రొమాన్స్ చేస్తే ఫీలింగ్స్ ఎలా వస్తాయి?
"శివాజీ ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో రొమాన్స్ చేస్తే ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? నాకు ఎవరైనా నచ్చి రొమాన్స్ చేస్తే అది వేరే విషయం. కానీ అప్పటికే శివాజీకి పెళ్లయింది. అతను నాతోటి నటుడు కానీ నాతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు" అంటూ చెప్పుకొచ్చింది.
Also Read : ఆఫీషియల్, యష్ నిర్మాణంలోనే రామాయణం - ఈ భారీ ప్రాజెక్ట్ కోసం స్టార్ నిర్మాతతో కలిసిన 'రాకింగ్ స్టార్'