Actress Anushka Shetty Team Denies Marriage Rumours : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లిపై గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆమె వివాహం ఓ బిజినెస్ మ్యాన్‌తో జరగనుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై ఆమె టీమ్ రియాక్ట్ అయ్యింది. అవన్నీ రూమర్స్ అనీ అలాంటి వార్తలను నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది.

Continues below advertisement

'అది ఎందుకు హైలెట్ చేస్తున్నారు?'

ఒకరి పర్సనల్ లైఫ్‌ను రోజువారీ ముఖ్యాంశాలుగా మార్చే ముందు కనీసం అది అఫీషియలా కాదా అని కూడా చూడడం లేదని అనుష్క టీం స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యింది. 'అంచనా వేయడం, ఊహించడం అనధికార సమాచారాన్ని పదే పదే పబ్లిష్ చేయడం సరైన పద్ధతి కాదు. అన్నిటి కంటే నిరాశ కలిగించే విషయం ఏంటంటే... ఆమె వయసుపై అనవసరమైన శ్రద్ధ చూపడం.

Continues below advertisement

ప్రతీ పోస్ట్‌లోనూ '44' అనే నెంబర్‌ను ఏదో కాంట్రవర్సియల్ అంశంలా ఎందుకు హైలెట్ చేస్తున్నారు? కేవలం వయసే అంత పెద్ద సమస్య అయితే... హీరోల వయసు విషయంలో కూడా ఇదే ఉత్సాహం ఎందుకు ఉండడం లేదు. మహిళల విషయంలోనే ఈ స్టోరీ ఎందుకు డిఫరెంట్‌గా ఉంటుంది.' అంటూ టీం ప్రశ్నించింది.

Also Read : సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?

'బాధ్యతగా వ్యవహరించండి'

ఏదైనా వార్తలు ప్రచురించే ముందు నిజాన్ని తెలుసుకోవాలని... ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది టీం. 'అనుష్క శెట్టి తన కెరీర్‌ను గౌరవం, ప్రతిభతో హుందాగా నిర్మించుకున్నారు. ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో జరిగే విషయాలను అందరికీ చెప్పాలని అనుకోరు.

ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. పెళ్లి అనేది చాలా వ్యక్తిగత విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు. ట్రెండ్ కాదు. కేవలం వ్యూస్ కోసం సెన్సేషనలైజ్ చేయాల్సిన విషయం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. హద్దులను గౌరవించాలి. ఏదైనా పబ్లిష్ చేసే ముందు నిజాన్ని నిర్ధారించుకోండి. ముఖ్యంగా హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా గౌరవంగా చూడండి.' అని టీం పేర్కొంది.

ఇక సినిమాల విషయానికొస్తే... అనుష్క లాస్ట్ ఇయర్ ఘాటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు.