Venu Thottempudi Father Passes Away: ఒకప్పుడు కామెడీ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో వేణు తొట్టింపూడి. తాజాగా ఈ హీరో ఇంట విషాదం చోటుచేసుకుంది. వేణు తండ్రి ప్రొఫెసర్ తోట్టెంపూడి వెంకట సుబ్బారావు జనవరి 29 తెల్లవారుజామున కన్నుమూశారు. సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వెంకట సుబ్బారావు భౌతికాయాన్ని సందర్శానికి అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్‌లో వెంకట సుబ్బారావు భౌతికాయాన్ని సందర్శానికి ఉంచారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 


బ్యాక్ టు బ్యాక్ హిట్లు..


1999లో ‘స్వయంవరం’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు వేణు. అప్పట్లోనే వేణు.. చాలా బోల్డ్ కథలను ఎంచుకుంటూ హీరోగా టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నారు. అందుకే తనకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చాయి. మెల్లగా కామెడీ సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యింది. దీంతో తన ఫోకస్‌ను అటువైపు షిఫ్ట్ చేశారు. సెకండ్ హీరో రోల్ అయినా కూడా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు వేణు. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. మెల్లగా తనకు పరిశ్రమలో పోటీ పెరిగింది. అదే సమయంలో హిట్లు కూడా తగ్గిపోయాయి. దీంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయిపోయారు వేణు.


ఫలించని కమ్ బ్యాక్ లక్ష్యం..


మళ్లీ దాదాపు తొమ్మేదళ్ల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు వేణు తొట్టింపూడీ. వేణు కమ్ బ్యాక్‌ను చూసి ప్రేక్షకులు చాలా సంతోషించారు. ఇప్పటికే ఆయన కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వేణు కమ్ బ్యాక్ మూవీగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రేక్షకులను అస్సలు అలరించకపోయింది. దీంతో ఆయన కమ్ బ్యాక్‌ను కూడా మేకర్స్ పెద్దగా గుర్తించలేదు. దీంతో ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న ఓటీటీ ప్రపంచంపై కన్నేశారు వేణు. గతేడాదిలో ఓటీటీ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు.


Also Read: హృతిక్ రోషన్ కెరీర్‌లో 14 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయి.. ఆ సినిమాలు ఏమిటో తెలుసా?


బిజీ అవుతాడనుకున్న సమయంలోనే..


‘అతిథి’ అనే హారర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వేణు. నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయిన ఈ సిరీస్.. సబ్‌స్క్రైబర్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన ఓటీటీ నుండి మరికొన్ని అవకాశాలు వస్తాయని ఫ్యాన్స్ ఆశించడం మొదలుపెట్టారు. ‘అతిథి’లో రవి అనే పాత్రలో వేణును చూసి తన ఫ్యాన్స్ తెగ సంతోషించారు. ఇలా కొత్త కంటెంట్‌తో మళ్లీ ఆయన కమ్ బ్యాక్ ఇస్తే చూడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా వెండితెరపై తనకు అవకాశాలు లేకపోయినా.. ఓటీటీలో అయినా మళ్లీ బిజీ అవుతాడు అనుకునే సమయంలో తన తండ్రి మరణ వార్త ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.


Also Read: వెంకటేష్ మహా రిస్క్ తీసుకోలేదు, మేం తీసుకుంటున్నాం - నిర్మాత ధీరజ్ ధీరజ్ మొగిలినేని