Actor Thiruveer About His Carrer Emotional Moments : విలక్షణ పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో తిరువీర్. ఆయన హీరోగా నటించిన పాపం ప్రతాప్ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌ ఇంటర్వ్యూలో తన కెరీర్, ఎమోషనల్ మూమెంట్స్ గురించి షేర్ చేసుకున్నారు.

Continues below advertisement

'పేరెంట్స్ కర్మకాండలు చేయలేకపోయా' 

స్టేజి డ్రామాలో జూనియర్ ఆర్టిస్ట్ నుంచి సినిమాల వరకూ తన జర్నీలో ఎన్నో ప్రశంసలు, అవమానాలు, ఆకలి, హ్యాపీనెస్, ఎదురు దెబ్బలు ఉన్నట్లు చెప్పారు తిరువీర్. 'ఇది సినిమాలకు సంబంధం లేదు. సిట్యువేషన్ వచ్చింది కాబట్టి చెబుతున్నా. సింపతీ అసలే వద్దు. ఆ సింపతీతో మా సినిమా చూడొద్దు. గతంలో రెండు సినిమాల కంటిన్యుటీస్ వల్ల నా పేరెంట్స్‌కు నేను కర్మకాండలు చేయలేకపోయా. బొమ్మల రామారం టైంలో నా ఫాదర్ చనిపోయారు. పలాస చేస్తున్నప్పుడు నా మదర్ చనిపోయారు.

Continues below advertisement

ఒక్కడే కొడుకువి అయి ఉండి పేరెంట్స్‌కు ఆ మాత్రం కూడా చేయలేవా? అని చుట్టాలు నన్ను తిట్టారు. సినిమాలంటావ్ ఎందులోనూ కనిపించవు అన్నారు. ఇప్పటికీ నేను ఆ గిల్ట్ మోస్తుంటాను. ముగ్గురి కూతుళ్ల తర్వాత ఒక్కడే కొడుకుని. వాళ్లు చనిపోయిన తర్వాత కూడా నేను అది చేయలేకపోయా. నేను ఎంత స్టార్ డమ్ చూసినా ఆ గిల్ట్ నుంచి నేను తప్పించుకోలేను. లోపల చాలా బాధ ఉంటుంది. ఒకరితో ఏ మాట అనిపించుకోవద్దు అని నా పేరెంట్స్ నాకు ఎప్పుడూ చెప్పేవారు.' అంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : కొడుకుల కోసం కథ రాస్తే... తండ్రులతో ఓకే అయ్యింది - విశ్వంభర, బాలయ్య మూవీస్ వెనుక బిగ్ ట్విస్ట్!

పాపం ప్రతాప్ విషయానికొస్తే... ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించగా... తిరువీర్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించారు. అజయ్ ఘోష్, ప్రసాద్ బెహర, గోపరాజు రమణ, రాశి, రఘుబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించారు.

పెళ్లైన 4 రోజులకు భార్య భర్తను వదిలేసి వెళ్లిపోతే ప్రతాప్ అనే యువకుడు పడే కష్టాలు, ఇబ్బందుల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. లవ్, కామెడీ, ఎమోషన్ ప్రధానాంశాలుగా మూవీని తెరకెక్కించారు. 90ల బ్యాక్ డ్రాప్‌లో జరిగే పక్కా విలేజ్ కామెడీ డ్రామా అని తెలుస్తోంది.