Actor Suman: ఒకప్పుడు తెరపై దేవుడి పాత్రలు చేయాలంటే సీనియర్ ఎన్‌టీఆర్ గుర్తొచ్చేవారు. ఆ తర్వాత అలాంటి పాత్రలతో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు సుమన్. ఆయన కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన సినిమాల్లో రాముడిగా, వెంకటేశ్వర స్వామిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేస్తూ బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు విలన్ క్యారెక్టర్స్‌లో కూడా కనిపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్.. తన సెంటిమెంట్స్ గురించి బయటపెట్టారు. తనపై బ్లాక్ మ్యాజిక్ జరిగిందని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.


చెడు శక్తుల ప్రభావం..


తాను చేతబడి, బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటిని నమ్ముతానని, తనపై అలాంటి ప్రయోగాలు జరిగాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుమన్. ‘‘మనం జ్యోతిష్యాన్ని నమ్మాలి. బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటికి చాలా పవర్ ఉంటుంది. అవి చాలా పనిచేస్తాయి. మనపై అసూయగా ఉండేవాళ్లు అలాంటివి చేస్తారు. మన గ్రాహాలు బలహీనంగా ఉన్నప్పుడు అవి ప్రభావం చూపిస్తాయి. మంచి కంటే చెడే ముందుగా జరుగుతుంది. నాకు కూడా జరిగింది. నేను నమ్మి దానికి పరిష్కారం చూపించుకున్నాను. దేవుడు అనేవాడు కూడా ఉంటాడు. మంచి చేయాలని చూస్తాడు కానీ అప్పటికే చెడు శక్తుల వల్ల డ్యామేజ్ జరిగిపోతుంది’’ అని వివరించారు సుమన్. బ్లాక్ మ్యాజిక్‌నను యాక్సిడెంట్‌తో పోల్చారు.


దోచుకునేవారు ఎక్కువయ్యారు..


‘‘యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి పరిష్కారం ఏంటో సరిగ్గా తెలుసుకోగలగాలి. అలాగే బ్లాక్ మ్యాజిక్‌కు కూడా పలు పరిష్కారాలు ఉంటాయి. నాడి జోస్యం, చేయి చూసి జాతకం చెప్పడం లాంటివి కొంతమంది పర్ఫెక్ట్‌గా చెప్తారు. అవి మనం నమ్మాలి. నేను కూడా చిన్నతనంలో ఇవన్నీ నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నాను. మన సమస్య ఏంటో చెప్తే జ్యోతిష్య శాస్త్రం ద్వారా తీర్చగలగాలి. కానీ ఈరోజుల్లో డబ్బులు దోచుకునేవారు ఎక్కువయిపోయారు. అలాంటి వాళ్ల వల్లే చాలామందికి జ్యోతిష్యం, శాస్త్రాల మీద నమ్మకం పోయింది. వారి ఫీజు వారు తీసుకోవాలి. కానీ దోచుకోవడానికి ప్రయత్నించకూడదు’’ అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సుమన్.


మూడు షిఫ్ట్స్ చేశాను..


‘‘రాజకీయాల్లో ఉన్నవారందరికీ ఇది ఒక గుణపాఠం. నా దగ్గర ఉబ్బు, తెలివితేటలు ఉన్నాయి అనుకునేవాళ్లకి ఇదే ప్రూఫ్’’ అంటూ తనపై బ్లాక్ మ్యాజిక్ జరిగిన రోజులను గుర్తుచేసుకున్నారు సుమన్. ‘‘నన్ను అలాంటి వాటికి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఉదయం 7 గంటలకు షూటింగ్‌కు వెళ్తే రాత్రి 1 గంటవరకు మూడు షిఫ్ట్స్ చేసేవాడిని. చిరంజీవి కూడా అంతే. నా మార్కెట్‌ను బట్టి నేను డిమాండ్ చేయకుండానే డబ్బు వచ్చింది. ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన నాకు.. హీరో అవకాశాలు రావడమే గొప్ప విషయం అనుకున్నాను’’ అంటూ తన కెరీర్ మొదట్లో జరిగిన విషయాలను బయటపెట్టారు సుమన్. ఇప్పటికీ సౌత్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో బిజీగా గడిపేస్తున్నారు ఈ సీనియర్ యాక్టర్.


Also Read: తొలి సినిమాకే అవార్డు, మూడో సినిమాకే రూ. 100 కోట్ల గ్రాస్‌ - #NBK109 డైరెక్టర్ బాబీ బర్త్‌డే గ్లింప్స్ చూశారా?