Sree Vishnu Daughter Mridha Half Saree Function : వెరైటీ కాన్సెప్ట్స్, డిఫరెంట్ రోల్స్‌తో తనదైన యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు హీరో శ్రీవిష్ణు. హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన టైమింగ్, స్టైల్‌తో దూసుకెళ్తున్నారు. సినిమాలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ హీరో ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కూతురు హాఫ్ శారీ ఫంక్షన్ వైభవంగా జరగ్గా ఈ వీడియో వైరల్ అవుతోంది.
అంత పెద్ద కూతురు ఉందా?
శ్రీవిష్ణు భార్య పేరు ప్రశాంతి కాగా కూతురు మ్రిదా. రీసెంట్‌గా కూతురి హాఫ్ శారీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వేడుకకు నారా రోహిత్, సన్నిహితులు హాజరయ్యారు. ఆయనకు ఇంత పెద్ద కూతురు ఉందా? అంటూ నెటిజన్లతో పాటు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : బాలయ్య 'అఖండ' రుద్ర తాండవం - శివుడే నేలకు దిగి వచ్చాడా?... 'అఖండ 2' ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
ఇక సినిమాల విషయానికొస్తే... శ్రీవిష్ణు కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. రీసెంట్‌గానే 'సింగిల్' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. 'బాణం' సినిమాలో పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన... ఆ తర్వాత డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకటే కథ, మెంటల్ మదిలో, వీరభోగ వసంతరాయలు, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ, అల్లూరి చిత్రాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. 'సామజవరగమన' మూవీతో కెరీర్‌లో ఫస్ట్ టైం రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించారు. ఆ వెంటనే 'ఓం భీం భుష్' తో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం 'మృత్యుంజయ్'తో పాటు నెక్స్ట్ ప్రాజెక్టుపైనా వర్క్ చేస్తున్నారు.