Sivaji Apology About His Comments On Heroines Dressing : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై తన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న వేళ సీనియర్ హీరో శివాజీ స్పందించారు. తన కామెంట్స్‌పై విచారం వ్యక్తం చేస్తూ సారీ చెప్పారు.
మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నా
'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై తన కామెంట్స్ పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు శివాజీ. 'హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వారు ఇబ్బంది పడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెబుతూనే రెండు అన్ పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేశాను. దీని వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను మాట్లాడింది అమ్మాయిలు అందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్లినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే వారికి ఇబ్బంది ఉండదనేదే నా ఉద్దేశం. అంతే తప్ప ఎవరినీ అవమాన పరచాలని కాదు.
ఏది ఏమైనా రెండు వాడకూడని పదాలు దొర్లాయి. దానికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నా. నేను ఎప్పుడూ స్త్రీ అంటే ఓ అమ్మవారే అనుకుంటాను. సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనమంతా చూస్తున్నాం. అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు అనే ఉద్దేశంలో ఒక ఊరి భాష మాట్లాడాను. అది చాలా తప్పు. దీనికి నేను క్షమాపణలు చెబుతున్నా. నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ రెండు పదాలు దొర్లకుండా ఉండాల్సింది. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలి అనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. మహిళలు ఎవరైనా తప్పుగా అనుకుని ఉంటే వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా.' అంటూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. 'అందం అనేది చీరలో నిండుగా కప్పుకొనే బట్టల్లో ఉంటుంది. అంతే తప్ప సామాన్లు కనపడే దాంట్లో ఏమీ ఉండదు. అవి వేసుకుంటే చాలా మంది నవ్వినా దరిద్రపు ము***** ఇలాంటి బట్టలెందుకు వేసుకుంది అని లోపల అనిపిస్తుంది. వేష భాషల నుంచే మన గౌరవం పెరుగుతుంది. ప్రపంచ వేదికలపై చీర కట్టుకున్న వారికే విశ్వ సుందరి కిరీటాలు వచ్చాయి.' అని అన్నారు. ఈ వీడియో వైరల్ కాగా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, హీరోస్ మంచు మనోజ్, నవదీప్ అందరూ రియాక్ట్ అయ్యారు. ఈ కామెంట్స్ సరికాదని అన్నారు. మంచు మనోజ్ శివాజీ తరఫున క్షమాపణలు చెప్పారు. టాలీవుడ్ మహిళా కమిటీ సైతం శివాజీపై 'మా' అధ్యక్షుడు విష్ణు మంచుకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో శివాజీ రియాక్ట్ అయ్యి సారీ చెప్పారు. ఇంతటితో ఈ వివాదానికి చెక్ పడుతుందనే చెప్పాలి.