పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాటకు బానిస నీవు - మన పెద్దలు చెప్పే నీతి మాటలు, సామెతల్లో ఇదొకటి. నటుడు శివాజీ సోమవారం (డిసెంబర్ 21, 2025వ తేదీ) రాత్రి నుంచి వార్తల్లో నిలవడానికి కారణం మాట అదుపులో లేకపోవడమే. మహిళల డ్రస్సింగ్ స్టైల్ గురించి ఆయన కామెంట్ చేశారు. చీర కట్టుకోవాలని హితవు పలికారు. ఆయన సలహా ఇచ్చే సమయంలో 'సామాను', 'దరిద్రపు ముండ' అనడంపై మహిళా లోక భగ్గుమంది. గాయని - సోషల్ మీడియాలో స్త్రీల సమస్యలపై గళం విప్పే చిన్మయి, నటి అనసూయ సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడీ టాలీవుడ్ మహిళా కమిటీ స్పందించింది.
శివాజీ బేషరతు క్షమాపణ చెప్పాలి!తెలుగు చలన చిత్రసీమలో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఆ మధ్య 'వాయిస్ ఆఫ్ విమెన్' కమిటీ ఏర్పాటు అయ్యింది. దర్శక నిర్మాతలతో పాటు నటీమణులు సైతం అందులో ఉన్నారు. మహిళలపై శివాజీ చేసిన కామెంట్స్ మీద ఇప్పుడీ కమిటీ స్పందించింది.
Also Read: హిందీలో 100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఏది? అందులో హీరో ఎవరో తెలుసా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో శివాజీ సభ్యుడు. ఆయన మీద 'మా' ప్రెసిడెంట్ విష్ణు మంచుకు టాలీవుడ్ మహిళా కమిటీ ఫిర్యాదు చేసింది. శివాజీపై చర్యలు తీసుకోవాలని కోరింది. అంతే కాదు... మహిళలు అందరికీ శివాజీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.