Sharwanand About ‘Manamey’ Movie: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది.
మంచి సినిమా చేశాం, బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం - శర్వానంద్
హైదరాబాద్ లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న శర్వానంద్.. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. సుమారు రెండు సంవత్సరాల తర్వాత తాను నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని వెల్లడించారు. “ఈసారి కుమ్మేశాం. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ రాసిపెట్టుకోండి. నా సినిమా వచ్చి రెండేళ్లు అయ్యింది. ‘మనమే‘ మూవీ మ్యాజిల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మంచి సినిమా చేశాం. ఇది మన తల్లిదండ్రులకు డెడికేట్ చేస్తున్న సినిమా. ఫ్యామిలీ అందరూ వచ్చి థియేటర్ లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లకు జనాలు వస్తలేరు అంటున్నారు. ఈ సినిమాతో జనాలను మళ్లీ థియేటర్స్ కు తీసుకొస్తాం. ‘శతమానం భవతి’ కంటే డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. నా సినిమాతో నాకే కాంపిటీషన్ ఉంది. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది” అని శర్వానంద్ తెలిపారు.
ఆకట్టుకున్న ‘మనమే’ ట్రైలర్
ఇక తాజాగా విడుదల చేసిన ‘మనమే’ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కథను రివీల్ చేయకుండా ఇంట్రెస్టింగ్ ఈ ట్రైలర్ ను రూపొందించారు. ఈ ట్రైలర్ లో శర్వానంద్, కృతి శెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్లు అర్థం అవుతోంది. అయితే, ఆ బాబుకు, వీరికి ఉన్న సంబంధం ఏంటి? అనేది సినిమాలో చూపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచుతోంది.
జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా ‘మనమే’ విడుదల
ఇక ‘మనమే’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదరు చూస్తున్నారు. రెండేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై శర్వానంద్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.
Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత