Raj Kumar Kasi Reddy: బెట్టింగ్ కేసులో నటుడు కసిరెడ్డి అరెస్టు, పైత్యం ముదిరిందంటూ నెటిజన్లు ఆగ్రహం

సినిమా ప్రమోషన్స్ కోసం చేసే పనులు ఒక్కోసారి తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా అరెస్ట్ అయ్యామంటూ ఇద్దరు యాక్టర్లు చేసిన వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Continues below advertisement

Raj Kumar KasiReddy and Ankith Koyya Arrest: సినిమాను తీయడమే కాదు, దాన్ని బాగా ప్రమోట్ చేసుకోవాలి. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించుకోవాలి. అప్పుడే మేకర్స్ సక్సెస్ అయినట్లు. ఎలాగైనా తమ సినిమాలను సరికొత్తగా ప్రమోట్ చేసి మంచి బజ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఫిల్మ్ మేకర్స్. రీసెంట్ గా నటి రోహిణి రేవ్ పార్టీలో అరెస్టు అయినట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. ఈ వీడియో నెట్టింట దుమారం రేపింది. కొంత మంది రోహిణి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు ఈ విషయంపై రోహిణి వివరణ ఇచ్చింది. సమస్య సర్దుమణిగింది.

Continues below advertisement

రోహిణి బాటలో మరో ఇద్దరు యాక్టర్లు

తాజాగా మరో ఇద్దరు నటులు కూడా రోహిణి స్టైల్లోనే తమ సినిమాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ఓ వీడియోను నెట్టింట్లోకి వదిలారు. అందుతో తాము బెట్టింగ్ కేసులో అరెస్టు అయినట్లు వెల్లడించారు. ఈ వీడియోనెట్టింట తెగ వైరల్ అయ్యింది. అయితే, ఈ వీడియో చివరల్లో ట్విస్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే?

అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ప్రస్తుతం ‘ఆయ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఆగష్టు 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడులైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. తాజాగా ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు అంకిత్, రాజ్ కుమార్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో వీరిద్దరు బెట్టింగ్ కేసులో అరెస్టు అయినట్లు చూపించారు. ఓ ఫ్లాట్ లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా వీరిద్దరిని అరెస్టు చేసి, పోలీస్ వెహికిల్ లోకి ఎక్కిస్తుంటారు. అప్పుడు మీడియాతో మాట్లాడిన రాజ్ కుమార్ అసలు విషయం చెప్తాడు. “గత ఏడాది కాలంగా సినిమాను తీస్తున్నాం. త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది. అయినా, ఈ మూవీ నిర్మాత బన్నీ వాస్ మా మాట వినడం లేదు. ప్రమోషన్స్ చేయమంటే రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని చెప్తున్నారు. అందుకే తను పోలీసులు అరెస్టు చేశారని చెప్పాం. ఇప్పుడు ఆయన మా కోసం వస్తున్నారు” అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొంత మంది ఈ ప్రమోషనల్ వీడియోను మెచ్చుకుంటుంటే, మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల కోసం జనాలను పిచ్చోళ్లను చేయకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Readశేఖర్ మాస్టర్ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాడు - ఆయనే అమ్మాయిలతో పులిహోర కలిపేస్తున్నాడు!

Continues below advertisement
Sponsored Links by Taboola