Actor Naresh Speech In Veeranjaneyulu Viharayathra Teaser Launch: సీనియ‌ర్ న‌టుడు నరేష్ కీలక పాత్రలో న‌టించిన సినిమా 'వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌'. ఆగ‌స్టు 14న ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. దానికి సంబంధించి టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. పవిత్ర లోకేశ్ ఈ టీజ‌ర్ ని లాంచ్ చేశారు. ఈ సినిమాలో.. నరేష్ తో పాటు శ్రీలక్ష్మి, ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన నరేష్ రామోజీరావును గుర్తు చేసుకున్నారు. ఆయ‌న గొప్ప‌త‌నం గురించి చెప్పుకొచ్చారు. 


ఎన‌ర్జీ కావాలంటే ఆయ‌న‌తో మాట్లాడేవాడిని.. 


"కృషి ఉంటే మ‌నుషులు ఋషులు అవుతారు అనేది రామోజీ రావుగారు నిరూపించారు. కృషితో ఋషి అయ్యి, లెజెండ్ అయ్యి, ఇవాళ తెలుగు సినిమాని ప్ర‌పంచ దేశాలకు తీసుకెళ్లారు. నా బండికి నాలుగు చ‌క్ర‌లు. వాళ్లు విజ‌య నిర్మ‌ల గారు, కృష్ణ గారు, జంధ్యాల గారు, రామోజీ రావు గారు. జీవితంలో చేసుకున్న అదృష్టాల్లో ఫిలిమ్ డివిజ‌న్, ఉషాకిర‌ణ్ ద‌గ్గ‌ర నుంచి శ్రీ వారికి ప్రేమ లేఖ‌లో నా కెరీర్ స్టార్ట్ అవ్వ‌టం. అలాంటి సినిమాలో నాకు అవ‌కాశం ఇవ్వ‌టం. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా కుటుంబంలో ఒక‌రిగా న‌న్ను భావిస్తారు. అది నా పూర్వ జ‌న్మ సుకృతం. ప్ర‌తి సంవ‌త్స‌రం ప్రియ ప‌చ్చ‌ళ్లు, డైరీలు అన్నీ ఇంటికి వ‌చ్చేవి. క‌చ్చితంగా వ‌చ్చేవి. అది రామోజీరావు గారు అంటే. నాకు ఎనర్జీ కావాల‌న్న‌ప్పుడు బాపినీడు గారికి ఫోన్ చేసి ఒక ఐదు నిమిషాల్లో పెద్దాయ‌న‌తో మాట్లాడాలి అని చెప్తాను. వ‌చ్చి క‌లిసి ఆయ‌న‌తో మాట్లాడి వెళ్తాను. ఆయ‌న గొప్ప‌త‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే" అని గుర్తు చేసుకున్నారు నరేష్. 


ఇలాంటి సినిమా అరుదు.. 


"'వీరాంజ‌నేయ విహార యాత్ర' ఆగ‌స్టు 14న రిలీజ్ కానుంది. ఈటీవీ విన్ లో ఇది రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ బాపినీడు గారితో శ్రీ వారి ప్రేమ లేఖ నుంచి ప‌రిచ‌యం. ఆయ‌న ప్రేమ, అభిమానం ఇప్ప‌టికీ అలానే ఉంది నా పైన‌. నేను స్కిప్ట్ విని.. ఇది ఇలానే చేస్తే ఎక్క‌డికో వెళ్లిపోతావు అన్నాను. జంధ్యాల గారి స్కిప్ట్ చూశాను, త్రివిక్ర‌మ్ ఇంకా చాలామంది స్క్రిప్ట్ చూశాను. అనురాగ్ స్క్రిప్ట్ చూశాను. ఇంత‌కంటే నేను చెప్ప‌కూడ‌దు. నిజంగా ఇలా చాలా అరుదు. సినిమా విజువ‌ల్ ట్రీట్. సినిమా గురించి చెప్పాలంటే కొద్దికాలం కింద‌ట శ‌త‌మానంభ‌వ‌తి సినిమా వ‌చ్చింది. అది ఎన్నారైల ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి ఒక్క‌రికి క్యాచ్ అయ్యింది. ఫ్యామిలీస్ కి క‌నెక్ట్ అయ్యింది. ఈ సినిమా రిలీజైన ఆగ‌స్టు 14 ప్ర‌తి ఎన్నారై, ప్ర‌తి ఒక్కరు కారులో బ‌య‌టికి వెళ్తారు. అలాంటి వారికి క‌నెక్ట్ అవుతుంది ఈ సినిమా." 


క‌చ్చితంగా సూప‌ర్ హిట్.. 


"ఈ సినిమాలోని ప్ర‌తి క్యారెక్ట‌ర్ లో ఎమోష‌న్ లాక్ చేశారు. క్లైమాక్స్ వ‌చ్చేవ‌ర‌కు ఎలా వెళ్లింది సినిమా అనిపిస్తుంది. ఉషాకిర‌ణ్ లో ‘శ్రీ‌వారికి ప్రేమ లేఖ’ ఎంత స‌క్సెస్ అయ్యిందో ఈ సినిమా ఈటీవీ విన్ లో అంత స‌క్సెస్ అవుతుంది. ఇది నాకు గోల్డెన్ జూబ్లీ ఫిలిమ్. నా అదృష్టం ఏంటంటే పెన్ పెట్టే ముందు నాకు ఫోన్ చేసి మీ క్యారెక్ట‌ర్ రాసుకుంటున్నాం అని చెప్పి మ‌రీ మొద‌లుపెడుతున్నారు. ఇదే నా అదృష్టం. ఇవాళ నేను యంగ్ గా ఉన్నాను అంటే అంద‌రు యంగ్ డైరెక్ట‌ర్స్ వ‌ల్లే. ఇక ఈ సినిమా ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతుంది. ఇది పైర‌సీ అవ్వ‌నే అవ్వ‌దు కేవ‌లం విన్ లో మాత్ర‌మే చూడ‌గ‌ల‌రు" అని అన్నారు నరేష్.  


Also Read: విజ‌య దేవ‌ర‌కొండ ఏం త‌ప్పు చేశాడ‌ని ట్రోల్ చేశారు? నివేద థామ‌స్ లావైతే వాళ్ల‌కెందుకు - రాజీవ్ క‌న‌కాల‌