టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్‌ల రిలేషన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ కిస్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై ఇంటర్నెట్ లో అనేక చర్చలు నడిచాయి.  అయితే ఇప్పటివరకు నరేష్ పవిత్ర పెళ్లి మీద వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలా సడెన్ గా వివాహం చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించడంతో ఈ టాపిక్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈ వ్యవహారం పై స్పందించింది. ఈ సందర్భంగా నరేష్, పవిత్ర పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలపై ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 


నరేష్, పవిత్రల పెళ్లి జరగనివ్వనంటూ మీడియా ముందుకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసింది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నరేష్, పవిత్ర ల పెళ్ళి తో పాటు వాళ్లిద్దరి లిప్ లాక్‌పై కూడా స్పందించింది. తనకూ, నరేష్ కూ విడాకులు అయిపోయాయని, అందుకే నరేష్, పవిత్రను పెళ్లి చేసుకోవడానికి సిద్దమైపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయని అన్నారు. అయితే ఆ వార్తల్లో ఎంత మాత్ర నిజం లేదని స్పష్టం చేసింది రమ్య. తమ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోందని చెప్పంది.


నరేష్, పవిత్ర లిప్ కిస్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి షాకింగ్ వార్తలు తనకేమీ కొత్త కాదని అంది. నరేష్ అశ్లీల వీడియోలు కూడా చూస్తాడని, దానికి తమ కొడుకే సాక్ష్యం అని తెలిపింది. నరేష్ వల్ల తమ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని వాపోయింది. తండ్రి అనే బాధ్యత కూడా లేకుండా నరేష్ దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నరేష్, పవిత్రల పెళ్లి వార్తల గురించి తానేమీ కంగారు పడటంలేదని, కానీ ఇలాంటివన్నీ చూసి ఏ భార్య అయినా ఎలా తట్టుకోగలదని ప్రశ్నించింది.


పవిత్ర తన ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు తన చేత్తో అన్నం పెట్టానని, ఇప్పుడు అన్న పెట్టిన చేతికే సున్నం రాస్తోందని మండిపడింది. నరేష్ తనను వదిలించుకోవడానికి ఎన్నో దారుణాలకు ఒడిగట్టాడని, అందుకే ఏదిఏమైనా నరేష్ కు మాత్రం తాను విడాకులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. గతంలో కూడా  నరేష్ పవిత్ర మైసూర్ హోటల్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది రమ్య. అప్పుడు కూడా వారిద్దరి పై పోలీసులకు ఫిర్యాదు చేసి రచ్చ చేసింది. తర్వాత కూడా ఇదే వ్యవహారంపై ఒకటిరెండు సార్లు వార్తల్లో నిలిచింది. రమ్య రఘుపతి ఏపీ కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె. 2010లో నరేష్ ఆమెను మూడో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. ఏదేమైనా ప్రస్తుతం నరేష్ పవిత్రల మేటర్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరి ఈ వ్యవహారం ఎటునుంచి ఎటు తిరుగుతుందో చూడాలి. 


Also Read: స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయిన ప్రభాస్ - కన్నీళ్లు ఆపుకోలేక!