Actor Naresh About 50 years career: నరేష్.. ఎన్నో వైవిధ్య క్యారెక్టర్లు, కామెడీ సినిమాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యాక్టర్‌. విజయనిర్మల కొడుకుగా అందరికీ పరిచయం. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఎన్నో బెస్ట్‌ ఫాదర్‌ క్యారెక్టర్స్‌లో నటించారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన తన గురించి ఎన్నో విషయాలను మీడియాతో ముచ్చటించారు. తన సక్సెస్‌ సీక్రెట్స్‌ ఎన్నో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇంత కెరీర్‌ ఇచ్చిన ప్రేక్షకులకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు నరేష్. ఈ సందర్భంగా ఆయన మన ఇండియన్‌ హీరోలు, చిరంజీవి, బాలకృష్ణపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.


ఇంకా చేయాల్సింది చాలా ఉంది.. 


సినిమా కెరీర్‌ మొదలుపెట్టి 50 ఏళ్లు అయిన సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు నరేష్. దాంట్లో ఆయన సినిమాలకు సంబంధించి, సెకెండ్‌ ఇన్సింగ్స్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. డెస్టినీ, డిటర్మినేషన్‌, డెడికేషన్‌ వల్ల తాను ఇక్కడి వరకు వచ్చానని అన్నారు నరేష్. "ఒక యాక్టర్‌గా ఉండటం అంత ఈజీ కాదు. పడి లేస్తుండాలి. వెనక్కి తిరిగి చూసుకోకూడదు. అలా చూసుకుంటే కచ్చితంగా భయం వేస్తుంది. అందుకే, గుర్రానికి కళ్లెం కట్టినట్లు ముందుకు మాత్రం చూస్తూ వెళ్లిపోయావాలి. సినిమా ప్రపంచం గ్యారెంటీ లేని ప్రొఫషన్‌ అని, 50 ఏళ్లలో ఇంకా హిట్లు ఉన్నాయి. హీరోగా 'జంబలకడి పంబ', 'కనకమహాలక్ష్మీ రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌' లాంటి తరాలు దాటి వెళ్లాయి. అలాంటి హిట్లు ఇచ్చాక జనాల్ని బోర్‌ కొట్టించడం ఇష్టంలేదు.అందుకే, వద్దని వదిలేశాను. ఆ తర్వాత పాలిటిక్స్‌కి వెళ్లాను, సోషల్‌ సర్వీస్‌ చేశాను అప్పుడే పరిస్థితులు తెలుసుకున్నాను. ప్రపంచం అంటే సినిమా కాదు.. ప్రపంచంలో సినిమా ఒకటి అని అర్థం అయ్యింది. అందుకే, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో హీరోగా కాకుండా గొప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అవ్వాలనే డెసిషన్‌ తీసుకున్నాను. ఆ డెసిషన్‌, ఆ డెడికేషన్‌ అన్నీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా సక్సెస్‌ ఇచ్చాయి. పోయిన ఏడాది దాదాపు 6 హిట్లు కొట్టాను" అని సినిమాలకి సంబంధించి విషయాలు పంచుకున్నారు. 


అందుకే ఆర్ఎస్ఎస్‌కు వెళ్లా


"మన హీరోలు నిజంగా చాలా గొప్పవారు, షారుఖ్‌ఖాన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, కమలహాసన్‌ వీళ్లంతా ఈ ఏజ్‌లో కూడా కొన్ని వందల కోట్ల మందిని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. వాళ్లను చూస్తే నిజంగా గర్వంగా అనిపిస్తుంది. హీరోలను ఎప్పుడు రిటైర్‌ చేయాలో ప్రేక్షకులకు తెలుసని, అంతేకాని సినిమాలు చూసి కమెంట్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు.మన ఇండియన్‌ హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్‌ ఎక్కడా ఉండదు. సినిమా సూపర్‌హిట్‌ అయినప్పుడు ఎవ్వరూ మాట్లాడరు.


ఇక తాను ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి స్పందిస్తూ.. ‘‘మధ్యలో సినిమాలు లేనప్పుడు, మంచి ఉద్దేశంతో ఆర్ఆర్ఎస్ఎస్‌లో చేరాను. ఒక పదేళ్లు నా బాడీ గురించి ఆలోచించలేదు. ఎక్కడపడితే అక్కడ తినేవాడిని. పూర్తిగా నేను పాలిటిక్స్, సిద్ధాంతాలు గురించి ఆలోచించాను. నా సినిమా మళ్లీ నన్ను పిలిచినప్పుడు.. వెనక్కి వచ్చి స్లిమ్ అయ్యాను. సినిమాలకు అనుగుణంగా నన్ను నేను మలుచుకున్నాను. ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ఎప్పుడూ బాగా టైం ఇస్తాను. అందుకే, క్యారెక్టర్‌కి తగ్గట్లు ట్రాన్స్‌ఫార్మ్‌ అవుతాను. అదే నా డెడికేషన్‌, అండ్‌ టెక్నిక్‌" అంటూ తన సక్సెస్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు నరేష్. 


Also Read: డబ్బు కోసం ఆమె నన్ను పెళ్లి చేసుకోలేదు, పవిత్రలో ఆ లక్షణాలు చూశా: నరేష్


విజయనిర్మల కొడుకుగా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పరిచయం అయిన నరేష్.. తన తొమిదేళ్ల వయసులోనే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 'పండంటి కాపురం' సినిమా ఆయన మొదటి సినిమా. ఆ తర్వాత 'జంబలకడి పంబ', 'చిత్రం భలారే విచిత్రం', ఈ మధ్య వచ్చిన 'రంగస్థలం' తదితర చిత్రాలు సూపర్‌ హిట్లు. కాగా.. ఈ మధ్య ఆయన, పవిత్ర లోకేశ్‌ తీసిన 'మళ్లీపెళ్లి' సినిమా కాంట్రవర్సీగా నడిచింది. అయితే, అది ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. కాగా.. ఓటీటీలో రిలీజైన కొన్ని సిరీస్‌లు మాత్రం సూపర్‌హిట్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి.