Actor Nabeel Zafar Comments on Sania Mirza Second Marriage: భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయాబ్‌ మాలిక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌-పాకిస్తాన్‌ అనే సరిహద్దులను కూడా లెక్కచేయకుండ ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 14 ఏళ్ల తమ వైవాహిక జీవితాన్ని స్వస్తీ చెబుతూ విడాకులు తీసుకుని విడిపోయారు. భర్తతో విడిపోయిన సానియా మిర్జా ప్రస్తుతం సింగిల్‌ పేరెంట్‌గా లైఫ్‌ లీడ్‌ చేస్తుంది.


కానీ షోయబ్‌ మాత్రం విడాకులు ప్రకటన ఇచ్చిన రోజుల వ్యవధిలోనే  పాకిస్తాన్‌ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సానియా మిర్జా రెండో పెళ్లిపై పాకిస్తాన్‌ నటుడు నబీల్‌ జాఫర్‌ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్‌గా 'మైండ్‌ నా కర్నా విత్‌ అహ్మద్‌ అలీ బట్‌' పాక్‌ న్యూస్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలా? ఒంటరిగా జీవిస్తే సరిపోదా? అనే సానియా మీర్జా చెప్పిన మాటలకు తన అభిప్రాయంచ చెప్పమని యాంకర్‌ నటుడు నబీల్‌ జాఫర్‌ అడిగాడు. దీనికి అతడు సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలని సూచించాడు.


ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిందే అన్నాడు. "విడాకులు తీసుకున్నంత మాత్రాన ఆ మనిషి జీవితం ఆగిపోయినట్టు కాదు. డైవోర్స్ వల్ల ఆ వ్యక్తి జీవితం చీకటమయం కాకూడదు. ఏ మహిళా/పురుషుడైనా విడాకులు తీసుకోవడమనేది దురదృష్టకరం. అలా జరిగిందంటే వారు మళ్లీ పార్ట్‌నర్‌ వేతుక్కోవాలి. అంతేకాని భర్తతో విడిపోగానే జీవితమే అంతమైపోయినట్టు బాధపడకూడదు. వాళ్లు మళ్లీ జీవిత భాగస్వామిని వెతుక్కొవాలి. మరో పెళ్లి చేసుకోవాల్సిందే. విడాకులు తర్వాత షోయాబ్‌ ఎలా అయితే మరో పెళ్లి చేసుకున్నాడో. సానిమా మీర్జా కూడా మళ్లీ పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. సరైన పార్ట్‌నర్‌ దొరికితే సానియా నువ్వు రెండో పెళ్లి చేసుకో" అంటూ  సలహా ఇచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.






నబీల్‌ జాఫర్‌  అభిప్రాయాన్ని స్వాగతిస్తూ కొందరు నెటిజన్లు అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. సానియాతో విడాకుల విడిపోయిన అనంతరం షోయాబ్‌ ఎలా అయితే మళ్లీ పెళ్లి చేసుకున్నాడో.. సానియా కూడా రెండో పెళ్లి చేసుకోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే అతడి కామెంట్స్‌ని తప్పుబడుతున్నారు. రెండో పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది సానియా వ్యక్తిగత విషయమని, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దంటూ ఫ్యాన్స్‌ అతడిపై మండిపడుతున్నారు. కాగా సానియా మీర్జా-షోయాబ్‌ మాలిక్‌ 2010లో పెళ్లి చేసుకోగా.. 2018లో కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు. ఈ ఏడాది ప్రారంభంలో వీరు విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నిజానికి వీరి వివాహ బంధానికి ఎండ్‌ కార్టు పడిన చాలా రోజులు తర్వాత విడాకుల విషయం బయటకు వచ్చింది. అదీ కూడా షోయబ్‌ మూడో పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు షేర్‌ చేయడంతో వీరిద్దరు విడిపోయినట్టు స్పష్టమైంది. 


Also Read: గోల్డెన్‌ హాట్‌ అంటూ కామెంట్‌, పవన్ కళ్యాణ్‌‌ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్‌ ఆగ్రహం - నాలా ఆయనకు ప్రేమ లేదు..