బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా లైన్ లైట్ లోకి వచ్చాడు మానస్. నిజానికి టాలీవుడ్ లోబాలయ్య, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఇతను, హీరోగా మారి కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలేవి హీరోగా మానస్ ని నిలబెట్టలేకపోయాయి. దీంతో ఒక్కసారిగా 'బిగ్ బాస్' షోకి రావడంతో మానస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 'బిగ్ బాస్' తర్వాత బుల్లితెరపై ఫుల్ బిజీ అయిపోయాడు.


ఓవైపు స్పెషల్ షోస్ లో మెరుస్తూ మరోవైపు సీరియల్స్ లో నటిస్తూ అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల మానస్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మారుతి తీసిన 'ఈరోజుల్లో' సినిమాలో హీరో మొదట తనకే ఛాన్స్ వచ్చిందని, ఆ సినిమా చేసుంటే ఈ రోజు తన కెరీర్ బాగుండేదని చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు.


"మారుతి గారు పిలిచి ఈరోజుల్లో సబ్జెక్టు గురించి చెప్పారు. కథ మొత్తం చెప్పాక ఈ సినిమాని 5D లో తీస్తామని అన్నారు. అలా చెప్పడంతో నాకేం అర్థం కాలేదు. 5Dలో ఎలా తీస్తారు? అని అనుకున్నా. ఎందుకంటే అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు. నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో అప్పటికీ నాకు 5D పై అంత ఐడియా లేదు. నాకు నమ్మకం కూడా లేదు. దాంతో వద్దులేండి అన్నాను. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు టాలీవుడ్ లోనే సరికొత్త బెంచ్ మార్కును క్రియేట్ చేసింది. డిజిటల్ కెమెరాస్ ని యూజ్ చేసి కూడా సినిమా తీయొచ్చు అని మారుతి గారు ఓ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను షాక్ అయ్యా. ముందు మనల్ని పిలిచారు. మనకే కదా కథ చెప్పింది. అసలు ఎలా జరిగిపోయింది? అని అనుకున్నా" అని తెలిపాడు.


"ఆ మూవీని అల్లు అర్జున్ గారు ప్రమోట్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. దాంతో పెద్ద సినిమా లాగా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పుడు ఎందుకిలా జరిగింది? మిస్ అయ్యాను అని బాధపడ్డా. నాకు ఆ టైంలో ఎవరూ గైడ్ చేసే వాళ్ళు లేక అలా జరిగింది. కానీ ఆ తర్వాత మారుతి గారు మళ్ళీ పిలిచి ఆయన బ్యానర్ లోనే రెండు సినిమాలు చేసే అవకాశం ఇచ్చారు. అలా 'గ్రీన్ సిగ్నల్', 'కాయ్ రాజా కాయ్' అనే సినిమాలు చేశాను" అని తెలిపాడు. ఒక మనిషి ఆపదలో ఉన్నాడంటే ఇతరులతో నీకు మంచి ర్యాపో ఉంటే కచ్చితంగా పదిమంది నీకు సాయం చేస్తారు. లేకపోతే మాత్రం తిరస్కరిస్తారు. నేను అది బాగా నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో ఓపిక ఉండాలి, అదే సమయంలో బిహేవియర్ కూడా బాగుండాలి. ఈ రెండు ఉంటే మాత్రం సక్సెస్ రావడానికి టైం పట్టొచ్చు కానీ కచ్చితంగా సక్సెస్ అవుతారు" అని అన్నాడు.


"ఈ రోజుల్లో' మూవీ తర్వాత 'రొమాంటిక్ క్రైమ్ కథ' మూవీలో హీరోగా ముందు నాకే అవకాశం వచ్చింది. ఆ మూవీ కూడా 5D ల్ షూట్ చేస్తున్నాం, గెరిల్లా స్టైల్ లో ఉంటుందని చెప్పడంతో నాకేం అర్థం కాలేదు. గుణశేఖర్ గారు తెరకెక్కించిన 'అర్జున్' మూవీలో కూడా మహేష్ బాబు గారితో నేను చేశాను. మహేష్ బాబు, నేను నంది అవార్డ్స్ తీసుకున్నప్పుడు ఒకే స్టేజి మీద ఉన్నాం. కానీ ఇప్పటివరకు నేను మహేష్ బాబుని సపరేట్ గా వెళ్లి కలవడం గానీ జరగలేదు. ఆయన మాత్రమే కాదు బి.గోపాల్ గారు, బాలయ్యను కూడా మళ్లీ కలిసింది లేదు. నేను బిగ్ బాస్ లో ఉన్నా కూడా నాకు సాయం చేయండి, నన్ను ప్రమోట్ చేయండని ఎవరి దగ్గరికి వెళ్లలేదు" అని చెప్పుకొచ్చాడు మానస్.


Also Read : విజయ్ 'లియో'కి ఆ దేశంలో నో కట్స్ - మరి, మన దేశంలో?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial