దక్షిణాది ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అభివృద్ధి గుర్తించి... దక్షిణ భారతదేశంలోని దార్శనిక ఆలోచనలు, దార్శనికతపై చర్చించేందుకు శతాబ్దానికి పైగా ఘన చరిత ఉన్న ABP నెట్ వర్క్ ఇవాళ చెన్నైలో ABP Southern Rising Summit 2023 నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ఏబీపీ మీడియాతో ఇంట్రాక్ట్ అయిన దగ్గుపాటి రానా పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రజెంట్ సౌత్ మూవీస్ ని ఆల్ ఓవర్ ఇండియా ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు  తెలుగు సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది దీనిపై మీ స్పందన ఏంటని? అడగగా..


"ఫిలిం మేకర్స్ కానీ ఆడియన్స్ కానీ ఇక్కడి వాళ్ళు చూపించే ప్రేమ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా ఉండదు. వాళ్లు ఇచ్చే ఈ ఎంకరేజ్‌మెంట్ తోనే మేమంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం. అలాగే పెద్ద సినిమాలను తెరకెక్కించే ఫిలిం మేకర్స్ ఉదాహరణకి తమిళనాడుకు వస్తే శంకర్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత తెలుగులో రాజమౌళి గారు చేసే సినిమా. ఈ సినిమాలు డబ్బింగ్ ద్వారా  వేరే వాళ్ళు చాలా చూస్తున్నారు. సో ఆర్ట్ అనే దానికి ఎలాంటి బౌండరీలు లేవనేది నా అభిప్రాయం. సినిమా అనేది అందరినీ కనెక్ట్ చేస్తుంది. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా ఏ ఇండస్ట్రీ నుండి వచ్చిన దాన్ని అందరూ ఆదరిస్తారు. అందుకే ఈరోజు మన ఇండియా 'వన్ యునైటెడ్ సినిమాటిక్ నేషన్' గా మారింది" అని చెప్పారు.


ఇంతకుముందు హాలీవుడ్ అనే ప్లేస్ లో అన్ని సినిమాలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అది ఇండియన్ సినిమాలో జరుగుతుంది. బాహుబలి తర్వాతే అందరూ ఇండియన్ సినిమా అని మాట్లాడుకుంటున్నారు  దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.." నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు ఏ భాష అనేది నాకు ప్రాబ్లం ఉండేది కాదు. నేను మద్రాస్ లో ఉన్నప్పుడు తమిళ సినిమాలు చూసేవాడిని. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా చూసేవాడిని. నాకు ఇతర భాషల్లో సినిమాలు చేసేటప్పుడు కూడా ఆ బాధ ఉండేది కాదు" అని అన్నారు.


‘‘నా ఫిలిం కెరీర్ తెలుగుతో మొదలై ఆ తర్వాత సెకండ్ ఫిలిం హిందీలో చేశాను. నాకు అప్పుడే అనిపించేది, సినిమా అనేది మనందరినీ కనెక్ట్ చేస్తుందని. ఎందుకంటే అందులో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అని అడిగితే.. "రజినీకాంత్ సినిమా కోసం చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఆయనతో కలిసి సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అంటూ రానా దగ్గుబాటి తెలిపారు.


Also Read : అబ్బో ఎంత తేడా - తమన్నా చిన్ననాటి వీడియో వైరల్, స్కూల్ డేస్‌లో మిల్కీ బ్యూటీ ఎలా ఉందో చూడండి





Join Us on Telegram: https://t.me/abpdesamofficial