టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది తమన్నా చిన్నప్పటి వీడియో కావడం విశేషం. ఇంతకీ ఆ వీడియో ఎందుకంత వైరల్ అవుతుంది? అందులో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే.. తమన్నా 2005లో 'శ్రీ' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికంటే ముందు హిందీలో 'చాంద్ షా రోషన్ చెహర' అనే సినిమాలో నటించింది. తమన్నా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సమయంలో ఆమె వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. చాలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ. అయితే తాజాగా తన మొదటి హిందీ సినిమా 'చాంద్ షా రోషన్' గురించి తమన్నా మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
"ప్రస్తుతం నేను పదవ తరగతి చదువుతున్నాను. త్వరలోనే పరీక్షలు కూడా రాయబోతున్నాను" అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అయితే తన 13వ ఏటా తమన్నా ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు. 13 ఏళ్ల వయసులోనే తమన్నా తన మొదటి సినిమాకు సైన్ చేసింది. కానీ ఈ సినిమా కాస్త ఆలస్యమవడంతో 15వ ఏటా తమన్నా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ వీడియోలో 'నా వయసు కేవలం పదమూడున్నర ఏళ్లు మాత్రమే' అని తమన్నా తెలిపింది. తమన్నా నార్త్ ఇండియన్ అనే విషయం తెలిసిందే. నిజానికి నార్త్ హీరోయిన్స్ చిన్న వయసులోనే కాస్త పెద్దగా కనిపిస్తుంటారు అనే అభిప్రాయం ఉంది.
తమన్నా వీడియో చూసిన తర్వాత ఆ మాట నిజమే అన్నట్టు అనిపిస్తుంది అంటూ కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతోంది తమన్నా. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ డం అందుకొని అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆ మధ్యకాలంలో కెరీర్ పరంగా కాస్త డౌన్ అయిన తమన్నా రీసెంట్ గా మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్యూ కూడా చేస్తోంది.
ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇటు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ కి ఎక్కువ ప్రాధాన్య ఇస్తూ అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా మారుతుంది. రీసెంట్ గా తమన్నా నటించిన 'జీకర్దా' 'ఆఖరి సచ్' వంటి వెబ్ సిరీస్ లు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మొత్తం మీద ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది.
Also Read : అందుకే నన్ను మళ్ళీ పిలిచారు - ఈడీ విచారణపై క్లారిటీ ఇచ్చిన నవదీప్!