ప్రముఖ మలయాళ నటుడు బాలా అరెస్ట్ కావడం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. స్వయంగా ఆయన మాజీ భార్య అమృత సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఏంటి? ఎందుకు పోలీసులు బాలాను అరెస్ట్ చేశారు? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


నటుడు బాలా అరెస్ట్ నటుడు 
ప్రముఖ తమిళ డైరెక్టర్ అన్నయ్య అయిన బాలా 2017లో సింగర్ అమృత సురేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2012లో ఈ జంటకు ఒక పాప పుట్టింది. అనంతరం ఇద్దరూ మనస్పర్ధలు కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2019లో ఈ దంపతులు విడాకుల బాట పట్టారు. ఇక నటుడు బాలా ఆమెకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలో బాలా తన పరువు తీసేలా ప్రవర్తిస్తున్నాడంటూ, అతడి మాజీ భార్య అమృత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అలా తనను వేధించడమే కాకుండా తన కూతుర్ని కూడా వెంటపడి వేధిస్తున్నాడంటూ ఆ కంప్లైంట్ లో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొచ్చిలో అతడి ఫ్లాట్ ఉండగా, సోమవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చిలో బాలాతో పాటు అతని మేనేజర్, ఫిలిం ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ యజనిని కూడా అరెస్ట్ చేశారు. చిన్న పిల్లని వేధించాడంటూ ఫిర్యాదు రావడంతో జువైనల్ యాక్ట్ కింద బాలాపై నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఇక తనను వేధిస్తున్నాడని ఇప్పటికే బాలాపై గతంలో రెండు మూడు సార్లు అమృత గృహ హింస కేసు కూడా పెట్టింది. ఇప్పుడు విడాకులు అయిపోయాక కూడా తమను వేధిస్తున్నాడు అంటూ ఆమె మరోసారి కేసు పెట్టడంతో వీరి వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 


కాగా భర్త అరెస్ట్ కావడం గురించి అమృత స్పందిస్తూ తాను చెప్పలేని శారీరక, మానసిక హింసను ఎదుర్కొన్నట్టు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ గొడవలన్నీ తన కూతురుపై ఎఫెక్ట్ చూపిస్తుండడంతో తాను ఆ ఇంటిని విడిచిపెట్టానని చెప్పుకొచ్చింది. 'విడాకుల తర్వాత కూడా మేము ప్రశాంతంగా జీవించాలని అనుకున్నా అతని వల్ల కుదరలేదని, తాము సోషల్ మీడియాలో తీవ్రమైన వేధింపులను ఎదుర్కొన్నామని, అమ్మాయి పాఠశాలకు వెళ్లడం కూడా ఇబ్బందికరంగా మారిందని ఆమె వెల్లడించింది.


Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?


ఎవరు ఈ బాలా? 
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాలా. తెలుగు ప్రేక్షకులకు ఆయన గురించి పెద్దగా పరిచయం లేదు గాని తమిళ, మలయాళ ఇండస్ట్రీలో అయితే అతన్ని బాగా గుర్తుపడతారు. 'కంగువా' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ శివకి ఇతను అన్నయ్య కావడం విశేషం. ఇక నటుడు బాలా 2006 నుంచి సినిమాలు చేస్తున్నాడు. అయితే సినిమాల కంటే ఎక్కువగా అతను ఇటీవల కాలంలో పెళ్లి, విడాకులు.. ఆ తర్వాత వేధింపులు వంటి ఆరోపణలతో ఎక్కువగా వార్తలు నిలుస్తున్నాడు. మరి ఈ వివాదానికి బాలా ఎలా ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.