Pushpa-2 Reload: పుష్ప-2 రిలీజ్‌ అయి నెల రోజులు పూర్తి చేసుకుంది. అయినా బాక్సాఫిస్ వద్ద సునామీ సృష్టిస్తూనే ఉంది. సంక్రాంతి టైంలో మూడు భారీ చిత్రాలు రానున్నాయి. దీంతో పుష్ప-2 సైడ్ అయిపోతుందని అనుకున్నారంత. కానీ మరిన్ని కీలకమైన సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు పుష్ప టీం తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పుష్ప రూలింగ్‌ నుంచి బయటకు వెళ్లడం లేదని తేల్చేశారు. దీంతో సంక్రాంతి బరిలో ఉంటామని సవాల్ చేశారు. 


"సంక్రాతికి వస్తున్నాం" "గేమ్‌ ఛేంజర్‌" "డాకు మహరాజ్‌" వరుసగా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్నాయి. పెద్ద పండగను క్యాష్ చేసుకోవడానికి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి మూడు సినిమాలే తలపడనున్నాయని అంతా అనుకున్నారు. కానీ పుష్ప కూడా రీలోడ్ వెర్షన్‌తో రాబోతున్నట్టు ప్రకటించాడు. పుష్ప-2లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో జనవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు టీం పోస్టర్ రిలీజ్ చేసింది. 



ఏకంగా 20 నిమిషాలు...


 పుష్ప -2లో ఒకట్రెండు సీన్‌లు కాదు ఏకంగా 20 నిమిషాలను కొత్తగా యాడ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సనిమా 3 గంటల 15 నిమిషాల నిడివి ఉంది. ఇప్పుడు మరో 20 నిమిషాల సీన్లు యాడ్ చేస్తున్నారు. దీంతో మొత్తం సినిమా నిడివి మూడు గంటల 35నిమిషాలు కానుంది. ఎక్కడెక్కడ సీన్లు యాడ్ చేయనున్నారు. అల్లు అర్జున్ పాత్ర సీన్లే యాడ్ చేస్తారా లేకుంటే ఫహద్‌ ఫాజిల్ సీన్లు యాడ్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. 


Also Read: రేసింగ్ సర్క్యూట్ లో కోలీవుడ్ స్టార్ కారుకు ఘోర ప్రమాదం... స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్




మిగిలిన ఆ ఒక్క రోజు కూడా 


జనవరి 10న గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న " గేమ్‌ ఛేంజర్‌" థియేటర్లలో సందడి చేయనుంది.  జనవరి 12న బాలయ్య, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన "డాకు మహరాజ్" సినిమా రిలీజ్ కాబోతోంది. విక్టరీ వెంకటేష్‌, దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ కాంబినేషన్‌లో వస్తున్న "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా జనవరి 14న ప్రేక్షకులను పలకరించనుంది.  ఇప్పటికే ఈ మూడు చిత్రాలకు సంబంధించిన ట్రైలర్లు విడుదలయ్యాయి. చిత్రాలపై భారీ అంచనాలు పెంచేశాయి. అయితే ఇప్పటికే హిట్‌ టాక్‌తో దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులు కొల్లగొట్టిన పుష్ప-2 ఈ రీలోడ్‌ వెర్షన్‌తో ఏం చేస్తాడో అన్న ఆసక్తి మొదలైంది. 


రికార్డులను వేటాడేస్తున్న పుష్ప-2
పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ రికార్డు ఇప్పటి వరకు బాహుబలి-2 పేరిట ఉండేది. కేవలం 32 రోజుల్లోనే పుష్ప-2 చిత్రం "బాహుబలి 2" రికార్డులను మూట కట్టి అటకెక్కించేసింది. రూ. 1,831 కోట్ల రూపాయలు వసూలు చేసి భారతీయ సినీ పరిశ్రమను రూల్‌ చేయడం మొదలెట్టాడు పుష్పగాడు. ఇప్పుడు రీ లోడ్‌ వెర్షన్‌తో మరెన్ని వండర్స్ క్రియేట్‌ చేస్తాడో చూడాలి. 


Also Read: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!