టాలీవుడ్ స్టార్ హీరోలంతా మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్, వెంకటేష్, బాలకృష్ణ లు కూడా థియేటర్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవలోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు. అల్లు అర్జున్ నూతనంగా నిర్మించిన ఏఏఏ సినిమాస్ మల్టిప్లెక్స్ ను నేడు(జూన్ 15) గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. దానితో పాటు ఓపెనింగ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇవి చూసిన బన్నీ అభిమానులు ‘ఆల్ ది బెస్ట్’ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఏషియన్ సినిమాస్ తో అల్లు అర్జున్..
టాలీవుడ్ హీరోలు వరుసగా మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి దిగుతున్నారు. ఇప్పటికే మహేష్ ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబి అనే మల్టీప్టెక్స్ మొదలు పెట్టాడు. ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటిగా ఎదిగింది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైపోయాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో ఏవిడి సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ ను నిర్మించాడు. ఇప్పటికే ప్రభాస్, వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు. అదే ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏఏఏ సినిమాస్ ను మొదలుపెట్టాడు అల్లు అర్జున్. దీనికోసం హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్ ఉన్న స్థలం లోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఈ మల్టిప్లెక్స్ ను నేడు గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు. ఓపెనింగ్ కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. దానితో పాటు ఓ నోట్ ను కూడా రాసుకొచ్చాడు బన్నీ ‘ఈరోజు ఏఏఏ సినిమాస్ మల్టిప్లెక్స్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అద్బుతమైన సినిమా ఎక్స్పీరీయన్స్ కోసం ఏఏఏ అందరినీ ఆహ్వానిస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏఏఏ ప్రత్యేకతలు ఇవే..
అత్యాధునిక హంగులతో ఈ ఏఏఏ మల్టిప్లెక్స్ ను నిర్మించారట. ఇందులో మొత్తం 5 స్క్రీన్ లు ఉన్నాయి. మొదటి స్క్రీన్ లో 67 అడుగుల ఎత్తు ఉంటుంది. డాల్బీ అట్మోస్ సౌండ్‍తో బార్కో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇక సెకండ్ లో ఈపీఐక్యూ లక్సన్ స్క్రీన్‍గా ఉంది. డాల్బీ అట్మోస్ సౌండ్ ఉంటుంది. మిగిలిన మూడు స్క్రీన్లు 4కే ప్రొజెక్షన్ తో నడుస్తాయి. ఈ ఐదు థియేటర్లలో డాల్బీ 7.1 సౌండ్ ఉంటుంది. ప్రేక్షకులు కూర్చొనే సీటింగ్ కూడా న్యూలుక్ తో కంఫర్ట్ గా డిజైన్ చేశారట. మొత్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ మల్టిప్లెక్స్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.
‘ఆదిపురుష్’ సినిమాతో ప్రారంభం..
ఈ ఏఏఏ సినిమాస్ మల్టిప్లెక్స్ లో హీరో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాతో స్క్రీనింగ్ ప్రాంభించనున్నారు. జూన్ 16 న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమాను ఏఏఏ లో కూడా ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్ లు కూడా ప్రారంభం అయ్యాయి. ఏఏఏ మల్టిప్లెక్స్ చూడటం కోసం అటు బన్నీ ఇటు ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయట. దీంతో తొలి సినిమాతోనే ఏఏఏ రికార్డ్ స్టాయి కలెక్షన్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారట బన్నీ ఫ్యాన్స్.
Read Also: కూతురు వయస్సుతో అమ్మాయితో లిప్ లాకా? ఆ నటుడిపై నెటిజన్ల విమర్శలు