సీనియర్ ఆర్టిస్టులు ప్రస్తుతం తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. కనిపించినా స్పెషల్ రోల్స్ అంటూ అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. ఒకప్పుడు అలీ, బ్రహ్మానందం వంటి ఆర్టిస్టులకు సపరేట్ ట్రాక్ ఉండేది. కానీ ఈ మధ్య అలాంటి అద్భుతమైన కామెడీ ట్రాక్‌లు కనిపించడం లేదు. సీనియర్ ఆర్టిస్టులు సైతం ఏ సినిమా పడితే ఆ సినిమాని చేయడం లేదు. తాజాగా అలీ ఓ కొత్త సినిమాతో అందరినీ అలరించేందుకు రెడీ అయ్యారు. హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి నిర్మిస్తోన్న కొత్త చిత్రం పూజా కార్య‌క్ర‌మాలతో సోమ‌వారం రోజున లాంఛ‌నంగా ప్రారంభమైంది. 

Continues below advertisement

ఈ సినిమాలో అనురాగ్‌, సంతోష్‌, సాయి విక్రాంత్, అలీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆటో రాంప్ర‌సాద్‌, ఫ‌ణి, వినీత రెడ్డి ముఖ్య పాత్రలను పోషించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, న‌టుడు అలీ, డైరెక్ట‌ర్ శ్రీనివాస రెడ్డి, ఫ‌ణి స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్ట‌గా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంతరం డైరెక్ట‌ర్ టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ మాట్లాడుతూ.. అనురాగ్ హీరోగా..ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి నిర్మాత‌లుగా ప్రారంభ‌మైన హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుందని అన్నారు.

Also Read: Nani Paradise - పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో

Continues below advertisement

మాకోసం వచ్చి, మమ్మల్ని ఆశీర్వ‌దించిన ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారికి, అచ్చి రెడ్డిగారికి, శ్రీనివాస రెడ్డిగారికి స్పెష‌ల్ థాంక్స్‌ అని, అలీగారు ఓ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారని దర్శకుడు తెలిపారు. అనురాగ్ మాట్లాడుతూ.. ప్రసాద్ వర్మగారు చెప్పిన పాయింట్ బాగా నచ్చిందని, మంచి ప్రొడ్యూసర్ సపోర్ట్ దొరికిందని అన్నాడు. సీనియ‌ర్ న‌టుడు అలీ మాట్లాడుతూ.. హన్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రాబోతున్న తొలి సినిమా ఇది అని అన్నారు. ఇందులో తాను కూడా ఓ మంచి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నానని అలీ తెలిపారు. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

Also ReadPhoto GalleryChiranjeevi Latest Photoshoot - బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్

నిర్మాత‌లు ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి మాట్లాడుతూ.. డైరెక్టర్ ప్రసాద్ వర్మగారు చెప్పిన వైవిధ్యమైన కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నామని అన్నారు. మా బ్యానర్లో రానున్న తొలి సినిమా ఇది అని వారు తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాల్ని మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Also ReadTrisha Krishnan - రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?