NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Begins - Jr NTR Movie Latest Update : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా గురించి ఓ అప్ డేట్ ఇచ్చారు. 

Continues below advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva)  దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా గురువారం (మార్చి 23న) పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 'ఆర్ఆర్ఆర్ : రుద్రం రణం రుధిరం' సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. హీరోగా ఆయన 30వ సినిమా. 

Continues below advertisement

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె NTR 30 Movie ని నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు సినిమాకు సంబంధించిన ఓ కబురు చెప్పారు. 

ఎన్టీఆర్ సినిమాకు కెన్నీ బేట్స్!
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాకు పని చేసిన స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ఎన్టీఆర్ 30 సినిమాకు పని చేయనున్నారు. పలు హాలీవుడ్ సినిమాలకు పని చేసిన ఆయన, తెలుగులో 'సాహో' సినిమాకు కూడా పని చేశారు. కొన్ని హిందీ సినిమాలు కూడా చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కెన్నీ బేట్స్ డిస్కస్ చేస్తున్న ఫోటో విడుదల చేశారు. అది చూస్తే... షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ అని తెలుస్తుంది. సినిమాలో మెజారిటీ ఫైట్స్ ఆయనే చేస్తారని ఎన్టీఆర్ 30 బృందం తెలిపింది.  

Also Read : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్!
ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభోత్సవంలో కథ, హీరో క్యారెక్టర్ గురించి కొరటాల శివ క్లారిటీగా చెప్పేశారు. స్టోరీ రివీల్ చేసేశారు. ''అనగనగా సముద్ర తీర ప్రాంతం! మనం మర్చిపోయిన భూభాగం! ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటాయి (మృగాలు లాంటి మనుషులు అన్నమాట). భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి. దేవుడు అంటే భయం లేదు. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం. ఆ భయం (ఎన్టీఆర్ పాత్రను ఉద్దేశిస్తూ...) ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఇదీ కథా నేపథ్యం'' అని కొరటాల చెప్పారు. 

Also Read : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

మృగాలు వంటి మనుషులను భయపెట్టే మగాడిగా, చాలా శక్తివంతంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని పరోక్షంగా ఆయన చెప్పేశారు. ''భయం ఉండాలి, భయం అవసరం కూడా! భయపెట్టడానికి సినిమాలో ప్రధాన పాత్ర (హీరో) ఏ స్థాయికి వెళతాడనేది ఎమోషనల్ రైడ్. ఇది నా బెస్ట్ సినిమా అని ప్రామిస్ చేస్తున్నాను'' అని కొరటాల శివ వివరించారు. ఎన్టీఆర్ తనకు సోదరుడు లాంటి వాడు అని, ఆయనతో రెండోసారి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాల తర్వాత అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) తెలుగులో చేస్తున్న చిత్రమిది. సినిమా ప్రారంభోత్సవంలో అనిరుధ్ మాట్లాడుతూ ''ఏడాది క్రితం దర్శకుడు కొరటాల శివ గారిని కలిశా. ఎప్పుడు కలిసినా ఓ మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆయన ఊహలో నేను ఓ భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన ఊహ భారీగా ఉంటుంది. ప్రాణం పోయగలనని అనుకుంటున్నా. లెజెండ్స్ తో కలిసి పని చేసే అవకాశం ఈ సినిమాతో లభించింది. మోషన్ పోస్టర్ సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఇచ్చిన శివ గారికి, తారక్ గారికి థాంక్స్... నేను తిరిగి వస్తున్నాను'' అని చెప్పారు.

Continues below advertisement