Abhishek Bachchan Reaction On Divorce Rumours With Aishwarya: బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ డివోర్స్ తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అవన్నీ రూమర్స్ అంటూ ఇన్ స్టా వేదికగా పలు సందర్భాల్లో అభిషేక్ క్లారిటీ ఇచ్చారు. అయినా... ప్రచారం మాత్రం ఆగలేదు. దీనిపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు.
అవి మాపై ఇంపాక్ట్ చూపించవు
సోషల్ మీడియా, ఆన్ లైన్ వేదికగా వచ్చే కామెంట్స్, రూమర్స్ తమపై అంతగా ప్రభావం చూపవని అభిషేక్ స్పష్టం చేశారు. 'మా కుటుంబం అంతా వర్క్‌కు సంబంధించి చాలా విషయాలపై చర్చించుకుంటాం. సినీ రంగానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరగడంతో ఎలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి. ఎలాంటి విషయాలు వదిలేయాలి అనే దానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. సోషల్ మీడియాలో రూమర్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపించవు.
మా అమ్మ, నా భార్య బయట ప్రపంచం చేసే కామెంట్స్, సోషల్ మీడియా రూమర్స్ మా కుటుంబంలోకి తీసుకురారు. మా ఫ్యామిలీ అంతా సంతోషంగా జీవిస్తున్నాం.' అని అభిషేక్ వెల్లడించారు.
Also Read: డైరెక్టర్ To హీరో - తరుణ్ భాస్కర్ 'ఓం శాంతి శాంతి శాంతి' - రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
ఐశ్వర్యతో పరిచయం అప్పుడే...
తాను ఐశ్వర్యను 1995లో స్విట్జర్లాండ్‌లో ఫస్ట్ టైం కలిశానని... తన తండ్రి నటించిన సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు ఆమెను కలిసినట్లు అభిషేక్ చెప్పారు. బాబీ డియోల్ వల్ల ఐశ్వర్యతో పరిచయం ఏర్పడిందన్నారు. 'బాబీ డియోల్, ఐశ్వర్య ఓ సినిమా షూట్ కోసం అక్కడి వచ్చారు. మేమంతా కలిసి డిన్నర్‌కు వెళ్లాం. ఆ టైంలో ఆమెతో చాలా విషయాలు మాట్లాడాను. తన మాటలు అర్థం కావడం లేదని చాలా రోజుల తర్వాత ఆమె చెప్పారు.' అని అన్నారు.
తన కుమార్తె ఆరాధ్య విషయంలో తామెంతో సంతోషంగా ఉన్నామని అభిషేక్ తెలిపారు. 'ఆరాధ్య... మా కుటుంబ గౌరవం సంతోషం. తనకు ఫోన్ లేదు. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోనూ అకౌంట్ లేదు. తన వ్యక్తిత్వానికి మేము ఎలాంటి ఇబ్బంది కలిగించాలనుకోలేదు. తనొక అద్భుతమైన మహిళగా అభివృద్ధి చెందుతోంది. ఆ క్రెడిట్ మొత్తం ఐశ్వర్యకే ఇస్తాను.' అని అన్నారు.
ఆ పోస్టుతో...
సోషల్ మీడియాలో ఎప్పుడూ అంత యాక్టివ్‌గా ఉండని అభిషేక్ బచ్చన్ ఇటీవల చేసిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. 'నాకు ఉన్నదంతా ఎంతో ఇష్టమైన వారికి ఇచ్చేశా. జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేయగా దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగింది. ఇదే క్రమంలో మళ్లీ విడాకుల రూమర్స్ హల్చల్ చేశాయి. తనపై వచ్చిన వార్తలన్నింటికీ స్పందిస్తే ఆజ్యం పోసినట్లవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ తెలిపారు. కానీ వాటి వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ బాధ పడుతున్నారని... వాటి గురించి నిజం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు.
ఇక సినిమాల విషయానికొస్తే... ఆయన రీసెంట్ మూవీ 'కాళీధర్ లాపత' డైరెక్ట్‌గా 'జీ5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మధుమిత ఈ మూవీకి దర్శకత్వం వహించగా... దైవిక్ భాగేలా, జీషన్ ఆయూబ్ కీలక పాత్రలు పోషించారు. అనాథ పిల్లల చుట్టూ ఈ కథ సాగుతుంది.