Aamir Khan Gauri Spratt To Have Registered Marriage : బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు ఆమిర్. 

Continues below advertisement

సింపుల్‌గా వివాహం

జులై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు ఆమిర్ ఖాన్. ముంబైలోని తన నివాసంలో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని అన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వేడుక జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. పెళ్లి తమ మొదటి ప్రాధాన్యత కాదని ఆయన అంగీకరించినప్పటికీ... ఇద్దరం కలిసి తమ బంధాన్ని తర్వాత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుక కోసం కొద్ది రోజులు మూవీస్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

Also Read : Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?

ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం. తన 60వ బర్త్ డే సందర్భంగా గతేడాది ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఇంట్రడ్యూస్ చేశారు ఆమిర్. అప్పటికే ఏడాదిన్నర నుంచి తాము డేటింగ్‌లో ఉన్నట్లు రివీల్ చేశారు. గత కొంతకాలంగా ఇద్దరి పెళ్లి వార్తలు వైరల్ అవుతుండగా తాజాగా కన్ఫర్మ్ చేశారు ఆమిర్. పెళ్లి వేడుక తర్వాత ఆమిర్... త్రీ ఇడియట్స్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభిస్తారని ప్రచారం సాగుతోంది. 

ఆమిర్ రీనాను వివాహం చేసుకుని 2002లో విడిపోయారు. వీరికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వీరు వివాహ బంధానికి స్వస్తి పలికారు. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో గౌరి స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుక సింపుల్‌గా జరగనున్నా... కొద్ది మంది బాలీవుడ్ స్టార్స్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.

Also Read : Manjusha Mukkavilli : మా ఇంటి బంగారంలో సమంత బెస్ట్ ఫ్రెండ్ - అసలెవరీ మంజూష?... రీల్స్ To మూవీస్

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.