Megastar America Tour: నిన్నటి వరకు 'భోళా శంకర్' మూవీ షూటింగ్, డబ్బింగ్ అంటూ బిజీ బిజీగా గడిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు విదేశాల్లో విశ్రాంతి తీసుకోడానికి ప్రయాణమయ్యారు. తన భార్య సురేఖతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సురేఖతో దిగిన ఫొటోలు షేర్ చేసిన ఆయన.. రిఫ్రెష్మెంట్ కోసం హాలిడేస్ లో స్పెండ్ చేసేందుకు యూఎస్ వెళ్తున్నానంటూ ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలను పంచుకున్నారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ కి ముందు హాలిడేస్ ను ఎంజాయ్ చేసేందుకు అమెరికాకు వెళ్తున్నానని ఆయన పోస్టులో రాసుకొచ్చారు. దాంతో పాటు ఈ షార్ట్ వెకేషన్‌లోనే తన అప్‌కమింగ్ మూవీ కోసం లుక్ టెస్టుల్లోనూ పాల్గొంటారని కూడా తెలుస్తోంది.
బాలకృష్ణ కూడా..
మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా ఆయన సతీమణి, మనవడితో కలిసి యూఎస్ కు పయనం కాగా .. ఇటీవలే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చెక్ ఇన్ అవుతున్న వీడియో ఒకటి వైరల్ కూడా అయింది. ఈ ఏడాదిలో 'వీర సింహారెడ్డి'తో బాలకృష్ణ, 'వాల్తేర్ వీరయ్య'తో చిరంజీవి అలరించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా ఒకే టైం లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి. అయితే ఈ ఇద్దరు బడా స్టార్స్ కూడా ఒకే టైమ్‌లో ఇలా ఒకే స్పాట్ కి వెకేషన్ కు వెళ్లడం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది.
ఇక 'భోళా శంకర్' సినిమా విషయానికొస్తే... ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది. ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఆయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో కలిసి‘బంగార్రాజు’ చేయనున్నారు. ఈ సినిమా మలయాళ హిట్ ‘బ్రో డాడీ’మూవీకి రీమేక్ గా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో మరొక యంగ్ హీరో కూడా నటించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి నిర్మించనుందని టాక్. దీంతో పాటు‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట్‌తోనూ మెగాస్టార్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య‘భగవంత్ కేసరి’ చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. అయితే, ఇటీవలే ఈ మూవీకి సంబంధించి భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య.. తానా సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. పదిరోజుల తర్వాత ఆయన తిరిగొచ్చాక ‘భగవంత్ కేసరి’ నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదల కానుంది.
Read Also : Vijay Varma: అమీర్ ఖాన్, కరిష్మా ముద్దులు, అయోమయంలో తమన్నా ప్రియుడు విజయ్ వర్మ- అసలేం జరిగిందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial