పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మెగా మల్టీస్టార్ మూవీ 'బ్రో'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతం' అనే మూవీకి ఇది తెలుగు రీమేగా తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన నటుడు దర్శకుడు పి. సముద్రఖని ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నారు. జి స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై వివేక్ కూచిబోట్ల, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్, సాయి తేజ సరసన ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా.. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ మోషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.


ముఖ్యంగా పవన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో 'బ్రోవక ధర్మ శేషం, బ్రోచిన కర్మహాసం, బ్రోతల చిద్విలాసం' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అదిరిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ను అందించారు మేకర్స్. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. సాయి ధరమ్ తేజ్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించాడు. చెప్పాలంటే దేవదూతను తలపించాడు. ఈ మూవీలో తేజ్ మార్కండేయుల్ (Mark) పాత్రలో కనిపించున్నాడు.


‘బ్రో’లో సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను ఇక్కడ చూడండి






ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'బ్రో' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు దక్కించుకుందట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తం తంబి రామయ్య అనే ఒక వ్యక్తి గురించి ఉంటుంది. ఆయన ఫ్యామిలీ గురించి. తంబి రామయ్య సాఫీగా ఓ కుటుంబ పెద్దగా తన బాధ్యతల్ని చక్కగా చూసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా ఒక కారు ప్రమాదంలో చనిపోతాడు. అయితే అప్పటికి ఆయన తన కూతురికి పెళ్లి చేయలేదు. అలాగే కొడుకు ఇంకా సెటిల్ కాలేదు. దాంతో దేవుడైన సముద్రఖని వేడుకోవడంతో ఓ మూడు నెలలు తిరిగి అతనికి జీవించే అవకాశం ఇస్తాడు. అలా ఒరిజినల్ వెర్షన్లో దేవుడి పాత్రను సముద్రక్ఖని పోషించగా.. రీమేక్లో దేవుడి పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. అలాగే తంబి రామయ్య పాత్రను సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జూలై 28న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.


Also Read: ‘బుజ్జిగాడు’ షూటింగ్‌లో ప్రభాస్ పైనుంచి బస్సు వెళ్లిపోయింది, నేను షాకయ్యా: నటి సంజన