బాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన గోవింద దాదాపు రూ.1000 కోట్ల స్కామ్ విషయంలో గోవింద పేరు బయటికి రావడం సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ విషయంపై ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ).. గోవిందను విచారించనున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
ప్రమోషన్స్‌లో భాగంగా..
సెప్టెంబర్ 13న బాలీవుడ్ హీరో గోవిందను విచారిస్తున్నట్టుగా ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) ప్రకటించింది. రూ.1000 కోట్ల పాన్ ఇండియా ఆన్‌లైన్ పోన్జీ స్కామ్‌లో గోవిందకు సంబంధాలు ఉన్నాయని వారు భావిస్తున్నట్టు బయటపెట్టింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పేరుతో సోలార్ టెక్నో ఏలియన్స్ (ఎస్‌టీఏ టోకెన్) అనే కంపెనీ వివిధ దేశాల్లో స్కామ్ చేసిందని ఈఓడబ్ల్యూ క్లారిటీ ఇచ్చింది. దానినే ఆన్‌లైన్ పోన్జీ స్కామ్ అంటున్నారని అర్థమయ్యేలా వివరించింది. పైగా ఈ స్కామ్‌లో గోవింద పేరు కూడా ఉండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. పలు ప్రమోషనల్ వీడియోలలో స్కామ్ చేసిన కంపెనీ పేరును గోవింద ఉపయోగించినట్టుగా తెలుస్తోంది.
నిందితుడు కాదు, అనుమానితుడు కాదు..
త్వరలోనే ఈఓడబ్ల్యూకు చెందిన ఒక టీమ్ ముంబాయ్‌కు వెళ్లి, గోవిందను ప్రశ్నిస్తుందని ఈఓడబ్ల్యూ ఇన్స్‌పెక్టర్ తెలిపారు. జులైలో గోవాలో జరిగిన ఎస్‌టీఏ ఈవెంట్‌కు గోవింద హాజరవ్వడంతో పాటు పలు వీడియోలలో ఆ కంపెనీనిని ప్రమోట్ చేసినట్టు చెప్పారు. అయితే ఈఓడబ్ల్యూ చెప్పినదాన్నిబట్టి చూస్తే.. గోవింద ఇప్పటికీ ఈ ఆన్‌లైన్ పోన్జీ స్కామ్‌లో నిందితుడు కాదు, అనుమానితుడు కాదు అని అర్థమవుతోంది. కానీ అసలు ఈ స్కామ్‌తో ఆయనకు ఉన్న సంబంధం ఏంటి అన్న విషయం విచారణ తర్వాత బయటపడుతుంది. ఒకవేళ ఎస్‌టీఏతో కేవలం ప్రమోషన్స్ వరకే ఆయనకు సంబంధం ఉన్నట్టుగా ఈఓడబ్ల్యూకు తెలిస్తే.. వెంటనే ఈ కేసులో ఆయన ఒక సాక్షిగా మారుతారు.
పలువురి అరెస్ట్..
భువనేశ్వర్, మయూర్‌భంజ్, భద్రక్, కియోన్‌ఝర్, బాలాసోర్ వంటి ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మంది నుంచి రూ.30 కోట్లను కలెక్ట్ చేసింది ఎస్‌టీఏ కంపెనీ. అంతే కాకుండా బిహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది పెట్టుబడిదారుల నుంచి భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు గురుతేజ్ సింగ్ సింధు, నిరోద్ దాస్‌లను ఆగస్ట్ 7న ఈఓడబ్ల్యూ అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించింది. వీరికి సంబంధించిన మరో వ్యక్తి రత్నాకర్ పాలాయ్‌ను ఆగస్ట్ 16న అరెస్ట్ చేసినట్టుగా తెలిపింది. డేవిడ్ గేజ్ అనే మరో వ్యక్తి కోసం ఈఓడబ్ల్యూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇక బాలీవుడ్ హీరో గోవింద జీవితంలో ఇప్పటివరకు పలు కాంట్రవర్సీలు జరిగినా.. రూ.1000 కోట్ల స్కామ్ అనేది చాలా పెద్ద విషయమని బీ టౌన్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. విచారణ తర్వాత ఈ స్కామ్‌తో తనకు ఏ సంబంధం లేకుండా బయటికి రావాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: థాంక్స్ చాలదు, సాంగ్స్ అదరగొట్టాలి - అల్లు అర్జున్, అట్లీ సినిమాకు అనిరుధ్ ఫిక్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial