Chor Bazaar Movie Release Date: ఆకాష్ పూరి 'చోర్ బజార్' రిలీజ్ ఎప్పుడంటే?

ఆకాష్ పూరి నటిస్తోన్న 'చోర్ బజార్' సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

Continues below advertisement

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'చోర్ బజార్'. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. 

Continues below advertisement

లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూన్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఈ సినిమాలో ఆకాష్ పూరి.. బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ తో మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నారు. కథ ప్రకారం.. ఆకాష్ పూరి దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కార్ల టైర్ల నుంచి బైక్ పార్టుల వరకు ప్రతిదీ ఎత్తేస్తూ చోర్ బజార్‌లో అమ్మేయడం ఈ గ్యాంగ్ పని. పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!

Also Read: 'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్

Continues below advertisement