రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సామాన్యులతో పాటు చాలా మంది సెలబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురికి కరోనా సోకింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 


ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కరోనా పాజిటివ్ వచ్చిందని.. స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ఇంట్లోనే క్వారెంటైన్ లో ఉంటున్నట్లు చెప్పారు. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు చిరంజీవి త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, తమన్, నాని ఇలా చాలా మంది సోషల్ మీడియా వేదికగా చిరు త్వరగా రికవర్ అవ్వాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చిరు నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' వంటి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు దర్శకుడు బాబీ, వెంకీ కుడుములతో సినిమాలు చేయనున్నారు చిరంజీవి. 






















Also Read: 'వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత'.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ చూశారా..?


Also Read: 'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..