సూపర్ స్టార్ మహేష్ బాబుకు మెగా స‌ర్‌ప్రైజ్‌ ఎదురైంది. నేడు (ఫిబ్రవరి 10) ఆయన పెళ్లి రోజు అనేది తెలిసిన విషయమే. అయినా సరే తెలుగు సినిమా పరిశ్రమ కోసం ఫ్యామిలీతో ఉండకుండా బయటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో నేడు తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రముఖుల్లో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఆయన పెళ్లి రోజు కావడంతో ఫ్లైట్‌లో మిగతా ప్రముఖులు విషెష్ చెప్పారు.


మహేష్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఫ్లైట్‌లో పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఫొటోను చిరంజీవి ట్వీట్ చేశారు. "అందరూ ఎంతగానో అభిమానించే మహేష్, నమ్రత దంపతులకు 17వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జీవితాంతం మీరిద్దరూ ఇలాగే ప్రేమతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని మెగాస్టార్ పేర్కొన్నారు. మ‌హేష్‌కు పూల‌బొకే అందించారు.






నమ్రతకు మహేష్ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. సితార ఘట్టమనేని సైతం తల్లిదండ్రుల ఫొటో పోస్ట్ చేసి... విషెష్ చెప్పారు.