Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode: అరవింద సహా కుటుంబ సభ్యులంతా తమవైపు రావడంతో మనీషా ఆనందానికి అవదులు ఉండవు. అత్త అరవింద తనను కోడలిగా అంగీకరించడం...లక్ష్మీని దూరం పెట్టడంతో మిత్రా సగం తనవాడైనట్లేనని భావిస్తుంది. ఇక దేవయానితో కలిసి కొత్త ఎత్తులు వేస్తుంది.పిల్లలను మిత్రాకు దూరం చేయాలని పన్నాగాలు పన్నుతుంది. అక్కడికి అరవింద రావడం చూసి వాళ్లిద్దరూ కలిసి కొత్త నాటకం ఆడతారు. ప్రశాంతంగా భర్త పక్కనే ఉంటే కడుపులో ఉన్న బిడ్డ హెల్తీగా ఉంటుందని డాక్టర్ సూచించారని...కానీ మిత్రా పక్కన ఉండటం తనకు ఎలా కుదురుతుందని దేవయాని అంటుంది. దీనికి సమాధానంగా మనీషా కూడా నాటకాన్నిరక్తికట్టిస్తుంది. పగలంతా మిత్ర ఆఫీసు పనిలో ఉంటాడని...సాయంత్రం కాగానే పిల్లల దగ్గరికి చేరిపోతున్నాడని ఇక నా వద్ద ఉండే ఛాన్స్ ఎక్కడ ఉందని మనీషా శోకాలు పెడుతుంది.దీంతో అరవింద ఈరోజు నుంచి పిల్లలు తన గదిలో ఉంటారని...నువ్వు మిత్రతో ఉండొచ్చని హామీ ఇస్తుంది.
తమ పాచిక పారిందని దేవయాని,మనీషా ఎగిరిగంతులేస్తారు.ఈరోజునుంచి మిత్ర పక్కన లక్ష్మీ ఉండదని సంబరపడిపోతారు. అరవిందను అడ్డుపెట్టుకుని ఈ ఇంట్లో ఇకపై మనం ఏమైనా చేయొచ్చని ఆనందపడిపోతారు. ఇప్పుడు నీ లగేజీ మొత్తం మిత్ర గదికి షిప్ట్ చేద్దామంటూ దేవయాని మనీషాను తీసుకుని వెళ్తుంది.
లక్ష్మీ కాపురం రోజురోజుకు సుడిగుండాల్లో కూరుకుపోవడం చూసి జానూ బాధపడుతుంది. తొలుత నెగిటివ్ వచ్చిన ప్రెగ్నెన్సీ రిపోర్టు ఆ తర్వాత మారిపోవడం వెనక మనీషా హస్తం ఉందని జానూ, వివేక్ అనుమానిస్తారు. డయాగ్నస్టిక్ సెంటర్‌కు ఫోన్ చేసి బెదిరించి ఉంటుందని అనుమానించి వారు దేవయాని ఫోన్,మనీషా ఫోన్ చెక్‌చేయాలనుకుని ఫోన్లకోసం వెతుకుతుంటారు.దేవయాని ఫోన్ దొరికినా....అది లాక్ చేసి ఉండటంతో నిరాశ చెందుతారు. దేవయాని ఫోన్ లాక్ ఓపెన్ చేసి చూస్తారు. కాల్ లిస్ట్ చెక్ చేస్తుండగా...అప్పుడే అక్కడికి దేవయాని, మనీషా వస్తారు. వాళ్లను చూసి జానూ,వివేక్ కర్టెన్ చాటున దాక్కుంటారు. గదిలోకి వచ్చిన మనీషా,దేవయాని మాట్లాడుకునే మాటలన్నీ చాటుగా వింటారు. ఇంతలో ఫోన్‌ను చూసుకున్న దేవయాని....తన ఫోన్ ప్లేస్ మారడంతో అనుమానిస్తుంది.ఈ గదిలోకి ఎవరైనా వచ్చి వెళ్లి ఉంటారని అనుకుంటారు. వారు బయటకు వెళ్లిపోగానే....జానూ, వివేక్ అక్కడి నుంచి బయటపడతారు. పిల్లల విషయం వెంటనే లక్ష్మీకి చెప్పాలని అక్కడి నుంచి వెళ్లిపోతారు. తాము విన్న విషయాలన్నీ వారు లక్ష్మీకి చెబుతారు. పిల్లలను మిత్రాకు దూరం చేసేందుకు దేవయాని,మనీషా ఆడిన నాటకాన్ని వివరిస్తారు. అలాగే ప్రెగ్నెన్సీ రిపోర్ట్ వచ్చిన సమయంలోనే దేవయాని ఫోన్‌కు గుర్తుతెలియని నెంబర్‌కు ఫోన్ చేసినట్లు చెబుతారు. దానికి లక్ష్మీ సమాధానమిస్తూ....మనీషా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ పాజిటివ్ వచ్చినప్పుడే వారు మేనేజ్ చేశారని అర్థమైందని అంటుంది. ఈ విషయాన్ని అరవిందకు చెబుతామని చెప్పగా...లక్ష్మీ వద్దని వారిస్తుంది.
ఇంతలో మిత్ర గదిలో వెళ్తున్న పిల్లలను అరవింద ఆపుతుంది. తనతోపాటు తన గదిలో పడుకోవాలని కోరుతుంది. నాకు మీతో ఉండాలని ఉందని చెప్పడంతో వారు సరేనని అరవింద గదికి వెళ్లిపోతారు. ఈలోగా మనీషా లక్ష్మీ దగ్గరకు వచ్చి జ్యూస్ కావాలని అడుగుతుంది.
తాను మిత్ర గదిలోకి వెళ్తున్నానంటూ లక్ష్మీని మనీషా రెచ్చగొడుతుంది. జ్యూస్ తీసుకుని మనీషా మిత్ర గదిలోకి వెళ్తుంది. దీంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగిసిపోతుంది.