మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఖిలాడి'. ఇందులో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ రోజు కొత్త పాట 'క్యాచ్ మీ'ని విడుదల చేశారు. ఆల్రెడీ సాంగ్ విడుదల విషయం చెబుతూ వదిలిన స్టిల్స్‌లో డింపుల్ హయతి స్పైసీ పోజులు ఇచ్చారు. ఈ రోజు విడుదలైన సాంగ్ కూడా స్పైసీగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా... శ్రీమణి రాసిన ఈ పాటను నేహా భాసిన్, జస్ ప్రీత్ జాస్జ్ ఆలపించారు. సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లేలా, బాలీవుడ్ స్టైల్ లో సాంగ్ ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
రమేష్ వర్మ దర్శకత్వం వహించిన 'ఖిలాడి'లో రవితేజ డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమాను ఈ నెల 11న తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. 'ఖిలాడి' నిర్మాణ సంస్థల్లో ఒకటైన పెన్ స్టూడియోస్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసే. ఏ స్టూడియోస్‌తో సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీలో పెన్ స్టూడియోస్‌కు భారీ నెట్‌వర్క్ ఉంది. సినిమా మీద నమ్మకంతో హిందీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. హవీష్ ప్రొడక్షన్, జయంతిలాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు సినిమాను నిర్మించారు.
ప్రస్తుతం సినిమా విడుదలపై కొన్ని సందేహాలు నెలకొన్నాయి. ఈ నెల 11న విడుదల కావడం లేదని, 18కి వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే... 11నే విడుదల చేస్తామని ఈ రోజు హిందీ వెర్షన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.