Rakhi Sawant: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఇటీవల వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గ్యాంగ్ నటి, డ్యాన్సర్ రాఖీ సావంత్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. అయితే, ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 


రాఖీ సావంత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. సల్మాన్‌కు దూరంగా ఉండాలని, ఆయన గురించి బయట మాట్లాడితే చంపేస్తామని వారు మెయిల్ ద్వారా హెచ్చరించారని తెలిపింది. దీనిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆమె వెల్లడించింది. 


కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో రాఖీ సావంత్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. రాఖీ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లిన రోజు నుంచి సల్మాన్ ఖాన్‌ను ఆరాధించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సల్మాన్, రాఖీ సావంత్‌‌కు కొన్ని వ్యక్తిగత విషయాల్లో, సంక్షోభ సమయాల్లో కూడా సాయం చేశారు.


గత కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్‌కు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై రాఖీ సావంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ‘‘సల్మాన్ ఖాన్ తరపున నేను బిష్ణోయ్ సమాజానికి క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి ఆయన గురించి చెడుగా మాట్లాడకండి’’ అని రాఖీ వెల్లడించింది. ‘‘సల్మాన్ ఖాన్ ఒక గొప్ప వ్యక్తి. ఒక లెజెండ్. ఆయన పేదలకు సాయం చేస్తారు. ఆయనను క్షమించండి’’ అని వేడుకుంది. 


సల్మాన్ ఖాన్ చాలా కాలం నుంచి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. గత నెల 30వ తేదీన కూడా ఆయన్ను చంపేస్తామంటూ ఓ కాల్ రాగా.. పోలీసుల విచారణలో షాపూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో మెయిల్ వచ్చింది. ఆయన్ని ఏప్రిల్ నెలాఖరులోగా చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ లో పేర్కొన్నారు. 


సల్మాన్ గురించి మాట్లాడకుండా ఉండలేను


తనకు వచ్చిన బెదిరింపు మెయిల్‌పై రాఖీ స్పందిస్తూ.. ‘‘సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడితే చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. ఎందుకంటే అతను నా తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు సహాయం చేశారు. నా కుటుంబం రూ. 50 లక్షలు ఖర్చు చేశారు. నా తల్లిని క్యాన్సర్ నుంచి రక్షించడానికి ప్రయత్నించడానికి సాయపడిన వ్యక్తి గురించి నేనెందుకు మాట్లాడకూడదు?’’ అని పేర్కొంది. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయనని స్పష్టం చేసింది. 


ఇదిలా ఉండగా హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్, హీరోయిన్ పూజా హెగ్డే, భూమికా చావ్లా, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్, సిద్ధార్థ్ నిగమ్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 21 న థియేటర్లలోకి రానుంది. 


Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?